సాహో హిట్టా..ఫట్టా..?

సాహో హిట్టా..ఫట్టా..?
x
Highlights

హై ఎక్స్‌పెక్టేషన్స్‌ మధ్య రిలీజ్‌ అయిన సాహో మూవీ.. ఎలా ఉంది..? విజువల్‌ వండర్‌ అయిన సాహో ప్రభాస్‌ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా..? హాలీవుడ్‌ రేంజ్‌లో...

హై ఎక్స్‌పెక్టేషన్స్‌ మధ్య రిలీజ్‌ అయిన సాహో మూవీ.. ఎలా ఉంది..? విజువల్‌ వండర్‌ అయిన సాహో ప్రభాస్‌ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా..? హాలీవుడ్‌ రేంజ్‌లో తీసిన అద్భుతమైన విజువల్‌ వండర్‌ సగటు తెలుగు ప్రేక్షకుడి మెదడుకెక్కిందా..? అసలు సాహో.. హిట్టా..? ఫట్టా..?

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన బాహుబలి తర్వాత టాలీవుడ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నుంచి వచ్చిన సాహోపై ప్రేక్షకుడి అంచనా ఏ లెవెల్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే సాహో మూవీ అనుకున్నంత రేంజ్‌లో లేదంటున్నారు ఫ్యాన్స్‌. టేకింగ్‌ కానీ, స్క్రిన్ ప్లే కాని కన్ఫ్యూజన్‌లో పడేస్తుందని.. ఇది తెలుగు ప్రేక్షకుడిని అంతగా ఆకట్టుకోదంటున్నారు. ముఖ్యంగా చెప్పుకునేందుకు స్టోరీ పెద్దగా ఏమీ లేదంటున్నారు ప్రేక్షకులు. హాలీవుడ్‌ రేంజ్‌లో స్క్రీన్‌ కనిపిస్తున్నా 3 గంటల పాటు చూడటం ఇబ్బందిగా అనిపించిందంటున్నారు.

మరోవైపు ఫ్యాన్స్‌ మాత్రం సాహో మూవీ సూపర్‌ డూపర్‌ హిట్‌ అని తేల్చిచెబుతున్నారు. బాహుబలితో పోల్చుకోవద్దంటూ సాహో అదుర్స్‌ అంటున్నారు. సినిమాలో వచ్చే ట్విస్టులు మైండ్‌ బ్లోయింగ్‌ అంటున్నారు. క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్‌ సన్నివేశాలు ఊపిరి బిగపట్టేలా ఉన్నాయని చెబుతున్నారు. మంచి యాక్షన్‌ మూవీ చూసినంత ఫీల్‌ కలుగుతుందని ఎంజాయ్ చేస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories