Top
logo

బీహార్ లో పుట్టుంటే గుడి కట్టేసేవారంటున్న సాహో సుజీత్!

బీహార్ లో పుట్టుంటే గుడి కట్టేసేవారంటున్న సాహో సుజీత్!
Highlights

సినిమా జయాపజయాలు చాలా విషయాల మీద ఆధారపడి ఉంటాయి. సాహో కూడా దానికి అతీతం కాదు. సినిమాకి ఇచ్చిన విపరీతమైన హైప్ హిందీకి పని చేసింది. ఎందుకంటే అంత హైప్ పబ్లిసిటీ ఉంటేనే ఒక దక్షినాది హీరో సినిమా అక్కడ నిలబడగలదు. కానీ, తెలుగలో హైప్ పబ్లిసిటీ వచ్చిన సినిమా ఏ మాత్రం అటూ ఇటూ గా ఉన్నా ప్రేక్షకులు అసంతృప్తి చెందుతారు. అది తెలుగు ప్రేక్షకుల అభిమానం అంతే. కానీ, సాహో హిందీ ప్రేక్షకులు ఆదరించారు..తెలుగు ప్రేక్షకులు ఆడరిన్చాలేదన్నట్టుగా దర్శకుడు సుజీత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం విమర్శల పాలవుతున్నాయి.

సుజీత్ ఓ షార్ట్ ఫిలిం దర్శకుడి స్థాయి నుంచి 350 కోట్ల బడ్జెట్ తో ఓ సినిమాని తియగలిగే స్థాయికి ఎదిగిన యంగ్ డైరెక్టర్. 'రన్ రాజా రన్' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరచయం అయ్యాడు .ఈ ఒక్క సినిమాతో ప్రభాస్ దృష్టిని ఆకర్షించిన సుజీత్, తన తరువాతి సినిమా ప్రభాస్ తో చేసేందుకు ఛాన్స్ కొట్టేశాడు . రెండేళ్ళు కష్టపడి, బడాబడా నటులతో మంచి నైపుణ్యం ఉన్న సాంకేతిక వర్గంతో సినిమాని కంప్లీట్ చేసాడు . గత నెల (ఆగస్టు ) 30 న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది .

సినిమా ప్రిమియర్ షో నుండే డివైడ్ టాక్ తో ముందుకు వెళ్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు విమర్శలే ఎక్కువ వచ్చాయి. సాహో మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నవాళ్ళూ సినిమా చూసి పెదవి విరిచేశారు. వసూళ్ళు పరంగా సినిమా బాగానే పోతోంది. అదీ హిందీ వెర్షన్. దాంతో ఇప్పటికే సినిమా 350 కోట్లను కలెక్ట్ చేసినట్టుగా చిత్ర యూనిట్ అధికారకంగా ప్రకటించింది. అయితే, సినిమా తీసింది తెలుగులో అని దర్శకుడు చెప్పినా.. పూర్తిగా హిందీ సినిమాలా ఉండడం తెలుగు ప్రేక్షకులకు మింగుడు పడలేదు. దీంతో సినిమా పై వారు అసంతృప్తికి లోనయ్యారు. అదే ఈ ప్రాంతంలో కలెక్షన్లలో కనిపించింది కూడా.

కాగా, సినిమా ప్రమోషన్ లో భాగంగా సుజీత్ ఓ ఇంటర్వ్యూ లో మాట్లడుతూ సాహో సినిమాని ఓ ప్రెంచ్ సినిమా నుండి కాపీ కొట్టానని కొందరు అంటున్నారని అది నిజం కాదనీ అన్నాడు. నిజానికి తాను అ ప్రెంచ్ సినిమాని చూడలేదని చెప్పుకొచ్చిన సుజీత్ ..నాన్న చనిపోతే ఎక్కడో దూరంగా ఉన్న ఓ కొడుకు వచ్చి నేనే అ తండ్రికి కొడుకు అని నిరోపించుకుంటే అలాంటి సినిమాలన్నీ ప్రెంచ్ సినిమానే అవుతాయా అని ప్రశ్నించాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమాకి హిందీలో మంచి ఆదరణ లభించిందనీ, ముఖ్యంగా బీహార్ నుంచి మంచి స్పందన వస్తోందనీ అన్నాడు . బీహార్ నుండి కొంతమంది ప్రేక్షకులు ఫోన్ లు చేసి సినిమా బాగుందని బీహార్ లో పుట్టుంటే గుడి కట్టేసేవారిమని అన్నారని సుజీత్ చెప్పుకొచ్చాడు. నిజమే ఈ సినిమా హిందీలో తీశాం.. తెలుగులో డబ్బింగ్ చేశాం అని చెప్పుంటే మేమూ గుడి కట్టకపోయినా.. సినిమాని ఆ ద్రుష్టిలో చూసేవారం కదా అంటున్నారు తెలుగు ప్రేక్షకులు. ప్రభాస్ సినిమా అంటే, తెలుగు సినిమాగానే భావించాం. సినిమా అంతా.. ప్రభాస్ తప్ప చెప్పుకోదగ్గ ఒక్క తెలుగు నటుడు లేరు. (వెన్నెల కిషోర్ ఉన్నాకానీ) అందుకే సినిమా మాకు హిందీ సినిమాలనే కనిపించిది అని కామెంట్లు చేస్తున్నారు.

Also Read - సాహోని మరోసారి చూడండి .. సుజీత్ భావోద్వేగ పోస్ట్

సాధారణంగా కమర్షియల్ సినిమాల్ని ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం లో భిన్నంగా చూస్తారు ప్రేక్షకులు. ప్రభాస్ మీద బాహుబలి మార్క్ ఉంది. తెలుగు ప్రేక్షకులు ఆ మార్క్ నే చూస్తారు. హిందీ ప్రేక్షకులు ఆ మార్క్ చూడరు. ఆ తేడానే సినిమాకి అక్కడ మంచి రన్ రావడానికి కారణమైంది అని చెబుతున్నారు విమర్శకులు. బీహార్ లో గుడి కట్టేవారట.. హిందీలో ప్రేక్షకులు ఆదరించారు అనే మాటలు చెప్పే బదులు తెలుగులో ఎందుకు ప్రేక్షకులు చూడలేదనే విషయాన్ని కాస్త ఆలోచించాలని సూచిస్తున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా తెలుగు ప్రేక్షకుల్ని తక్కువ చేసి మాట్లాడినట్టు అనిపించిందని అందరూ అనుకుంటున్నారు.

గతంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఇలాంటి కామెంట్స్ చేసాడని . అక్కినేని నాగర్జున , శ్రీదేవి జంటగా అయన రూపొందించిన గోవిందా..గోవిందా సినిమాకి గాను తెలుగు ప్రేక్షకుల నుండి ఇలాంటి స్పందనే రావడంతో తెలుగు ప్రేక్షకులుకు సినిమాలు చూడడం రాదంటూ అయన కూడా వ్యాఖ్యానించి, ఇక తెలుగులో సినిమాలు చేయనని అన్నారు. అయితే, మళ్లీ అక్కడనుంచి వచ్చి ఇక్కడే తన సినీ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ప్రేక్షకులూ కూడా ఆదరిస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల మంచి పధ్ధతి అది. అందువల్ల సుజీత్ తెలుగు ప్రేక్షకులను తక్కువ చేసి చూడొద్దు అంటూ సూటిగా చెబుతున్నారు...

Next Story

లైవ్ టీవి


Share it