సాహో దెబ్బకి బాలీవుడ్ షేక్ : ముచ్చటగా ప్రభాస్ మూడోసారి

సాహో దెబ్బకి బాలీవుడ్ షేక్ : ముచ్చటగా ప్రభాస్ మూడోసారి
x
Highlights

సాహోకి ముందు బాహుబలి , బాహుబలి 2, రోబో 2.0 సినిమాలు మాత్రమే ఈ వంద కోట్ల క్లబ్ లో చేరాయి ... వీటి తర్వాత సాహో సినిమా ఈ రికార్డును సృష్టించింది

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం కావడంతో, సాహో సినిమాపై మొదటినుండి భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి తోడు సినిమా బడ్జెట్ కూడా భారీగానే ఉండడంతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది . ఇక సినిమా విడుదలయ్యాక సినిమాపై కొందరు బాగుంది అంటే మరికొందరు బాలేదు అంటున్నారు . మొత్తానికి సినిమా మిక్సు డ్ టాక్ తో ముందుకు వెళ్తుంది .

టాక్ సో సో .. కలెక్షన్లు అదరహో ...

ప్రిమియర్ షో నుండి సినిమా మిక్సు డ్ టాక్ తో ముందుకు వెళ్తున్నా , కలెక్షన్ల దగ్గర మాత్రం ఎక్కడకూడా ఆగకుండా దూసుకువెళ్తుంది . బాలీవుడ్ లో మాత్రం కలెక్షన్ల పరంగా ఈ సినిమా ఓ సునామినే సృష్టిస్తుందనే చెప్పాలి . సినిమా మొదటిరోజు 24.40 కోట్లు వసూలు చేసింది ఇక రెండవ రోజు 25.20 కోట్లు, మూడవ రోజు 29.48 కోట్లు, నాలుగోవ రోజు వినయక చవితి అవడంతో సినిమా 14.20 కోట్లుని మాత్రమే వసూలు చేసింది . ఇక ఈ రోజు(మంగళవారం) రూ. 9.10 కోట్లును వసూలు చేసింది . ఈ రోజుతో మొత్తం సాహో సక్సెస్ ఫుల్ గా ఐదు రోజులు పూర్తి చేసుకుంది . మొత్తం ఈ ఐదు రోజులలో సాహో సినిమా బాలీవుడ్ లో 102.38 కోట్లకు రీచ్ అయింది. ఓ సౌత్ సినిమా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద వంద కోట్లను కొల్లగొట్టడం అనేది మాములు విషయం కాదనే చెప్పాలి .

సాహో కి ముందు ...

సాహోకి ముందు బాహుబలి , బాహుబలి 2, రోబో 2.0 సినిమాలు మాత్రమే ఈ వంద కోట్ల క్లబ్ లో చేరాయి ... వీటి తర్వాత సాహో సినిమా ఈ రికార్డును సృష్టించింది . ఇక మొత్తం ఓవరాల్ గా సినిమా 350 కోట్లు దాటేసినట్టు చిత్ర యూనిట్ కూడా అధికారికంగా ప్రకటించింది .. దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు .




Show Full Article
Print Article
More On
Next Story
More Stories