Top
logo

రూలర్‌ ట్రైలర్‌ : ఫ్యాన్స్ కి పునకాలే

రూలర్‌ ట్రైలర్‌ : ఫ్యాన్స్ కి పునకాలే
X
నందమూరి బాలకృష్ణ
Highlights

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం రూలర్‌. కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య సరనస సోనాలి చౌహాన్, వేదికలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం రూలర్‌. కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య సరనస సోనాలి చౌహాన్, వేదికలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జయసుధ, ప్రకాష్ రాజ్ , భూమిక ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాని క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్‌ 20 ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

పక్కా మాస్‌ కమర్షియల్ ఫార్ములాతో రూపొందిన రూలర్‌ ట్రైలర్‌ ఆదివారం రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. బాలయ్య మార్క్‌ పంచ్‌ డైలాగ్‌లు హీరో ఎలివేషన్‌ యాక్షన్‌ ఏ మాత్రం తగ్గకుండా ప్లాన్ చేశారు చిత్రయూనిట్‌.. ఇక చిత్ర ట్రైలర్ కి గాను అభిమానుల నుండి మంచి స్పందన వస్తుంది. ఎన్టీఆర్ బయోపిక్ తో నిరాశపరిచిన బాలకృష్ణ తన అభిమానులను అలరించాలని ప్లాన్‌ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగా పర్ఫెక్ట్ ప్యాకేజ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

సీ కళ్యాణ్ ఈ సినిమాని నిర్మిస్తుండగా, చిరంతన్‌ భట్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్‌ 20 ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.


Web TitleRuler Official Trailer released
Next Story