వామ్మో..రష్మిక!

వామ్మో..రష్మిక!
x
Highlights

విజయం ఎవరినైనా మార్చేస్తుంది. అందులోనూ సినిమా రంగం లో సక్సెస్ దొరికిందంటే చాలు.. ఇక హీరోయిన్లకు ఎక్కడ లేని డిమాండ్ వచ్చేస్తుంది. సినిమాల్లో సక్సెస్...

విజయం ఎవరినైనా మార్చేస్తుంది. అందులోనూ సినిమా రంగం లో సక్సెస్ దొరికిందంటే చాలు.. ఇక హీరోయిన్లకు ఎక్కడ లేని డిమాండ్ వచ్చేస్తుంది. సినిమాల్లో సక్సెస్ ఎంత కాలం ఉంటుందో గ్యారెంటీ కూడా ఉండదు. అందుకే.. డిమాండ్ వచ్చిన వెంటనే తమ పారితోషికాల్ని పెంచేస్తారు. ఇది సహజం.

ఇప్పుడు రష్మిక అదేపని చేస్తోంది. ఈ కన్నడ బ్యూటీ మొన్నటి 'గీతా గోవిందం' సినిమా వరకూ మన ప్రేక్షకులకు పెద్దగా తెలీదు. ఆమాట కొస్తే ఇండస్ట్రీలోనే ఎవరికీ తెలీదు. అయితే..తన రియల్ లైఫ్ లవ్ స్టోరీతో గాసిప్స్ లో బాగానే వినిపించేది. ఇక గీతా గోవిందం సక్సెస్ కావడంతో రష్మిక ఒక్కసారిగా టాప్ లోకి చేరిపోయింది. ఇంకేముంది అమ్మడు.. తన పారితోషికాన్ని పెంచేసింది. టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా వెలుగుతున్న ఈ భామ నాగార్జున, నానీల దేవదాసులో మెరిసింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ తో కల్సి డియర్ కామ్రేడ్ తో మరోసారి జత కట్టింది. తెలుగులో రష్మిక క్రేజ్ ఇలా ఉంటె.. తమిళంలో కూడా ఆమె పేరు మోగుతోంది.

ప్రస్తుతం కార్తీకి జంటగా నటిస్తూ తమిళంలో ఎంట్రీ ఇచ్చేసింది. ఇక ఇక్కడ హిట్‌ అందుకోవాల్సి ఉంది. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే విజయ్‌తో రొమాన్స్‌ చేసే అవకాశాన్ని కొట్టేసిందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. విజయ్‌ 64వ చిత్రంలో రష్మిక, రాశీఖన్నా నటించనున్నారన్న ప్రచారం జరుగుతోంది.

కానీ ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రాలేదు. ఇలా కన్నడం, తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ తక్కువ కాలంలోనే తన క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునే పనిలో పడిందట. పారితోషికాన్ని ఒక్కసారిగా రెట్టింపు చేసేసిందట. మొదట్లో రూ.40 లక్షలు పారితోషకాన్ని పుచ్చుకున్న రష్మిక ఇప్పుడు ఏకంగా రూ.80 లక్షలకు పెంచేసిందనే టాక్‌ సినీవర్గాల్లో గరం గరంగా మారింది. సాధారణంగా తెలుగు, తమిళ చిత్రాలకంటే కన్నడ చిత్రాల బడ్జెట్‌ తక్కువగానే ఉంటుంది. కాగా కన్నడంలోనే రష్మిక నటిస్తున్న చిత్రానికి రూ.60 లక్షలు డిమాండ్‌ చేసిందని చెప్పుకుంటున్నారు. దీంతో వామ్మో రష్మిక అంటున్నారట కన్నడ సినీ వర్గాలు. కాగా పారితోషకం పెంచడం గురించి మీడియా ప్రశ్నించగా మీరంతా మీడియాల్లో పని చేస్తున్నారు.. కొంత కాలం తరువాత జీతాలు పెంచాలని, పదోన్నతి పొందాలని ఆశించరా? తానూ అదే విధంగా పారితోషకం పెంచడంతో తప్పేంటి అని ఎదురు ప్రశ్నించి విలేకరుల నోళ్లు మూత పడేలా చేసింది. నటిగా ఇప్పుడు తన స్థాయి పెరిగిందని, అందుకు తగ్గట్టుగా పారితోషకాన్ని డిమాండ్‌ చేస్తున్నట్లు రష్మిక నిర్మొహమాటంగానే చెప్పేస్తోంది. నిజమే కదా.. అందుకే సినీ పరిశ్రమలో ఇపుడు అందరూ వామ్మో..రష్మికా.. అంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories