RRR: ఇప్పుడు ప్రేక్షకుల చూపు మే20 వైపే...

RRR: ఇప్పుడు ప్రేక్షకుల చూపు మే20 వైపే...
x
Jr.NTR (File Photo)
Highlights

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్.. (రౌద్రం, రణం, రుధిరం).. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే..

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్.. (రౌద్రం, రణం, రుధిరం).. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే..సినిమా షూటింగ్ జరుగుతున్నప్పటికీ సినిమా నుంచి ఒక్క అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతూ వచ్చారు. ఇక తాజాగా ఉగాది సందర్భంగా సినిమాకి సంబంధించిన లోగోను మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. అంతేకాకుండా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ లుక్ ని విడుదల చేసింది. ఈ ఫ‌స్ట్ లుక్ వీడియో ప‌లు భాష‌ల‌లో విడుద‌లై ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

ఇక ఇప్పుడు అంతా కొమరం భీమ్ గా ఎన్టీఆర్ లుక్ కోసం ఎదురుచూస్తున్నారు. మే 20 న ఎన్టీఆర్ పుట్టిన రోజు కాబట్టి ఆ రోజున ఎన్టీఆర్ లుక్‌కి సంబంధించిన వీడియోని చిత్ర బృందం విడుద‌ల చేస్తుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.. చరణ్ వీడియోకి ఎన్టీఆర్ వాయిస్ ని అందించాడు కాబట్టి ఇక ఎన్టీఆర్ వీడియోకి రామ్ చరణ్ వాయిస్ అందిస్తాడని అనుకుంటున్నారు. ఇక అల్లూరి సీతారామరాజుగా చరణ్ ని మరో లెవెల్ లో చూపించిన రాజమౌళి ఇక ఎన్టీఆర్‌ని ఏ విధంగా చూపిస్తాడ‌నేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని ఈ ఏడాది జూలై 30న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటిచింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల వలన సినిమాని వచ్చే ఏడాది 2021 జనవరి 8 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది.

ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌ లతో పాటు హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్, సముద్రఖని,శ్రియ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇక బాహుబలి లాంటి సినిమా తర్వాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడం, ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథని అందించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories