ఎన్టీఆర్ ఫాన్స్ కి బ్యాడ్ న్యూస్..

ఎన్టీఆర్ ఫాన్స్ కి బ్యాడ్ న్యూస్..
x
Jr.NTR (File Photo)
Highlights

టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం).

టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం). టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. కరోనా ప్రభావంతో సినిమా షూటింగ్ వాయిదా పడింది.

తాజాగా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన భీమ్ ఫర్ రామరాజు అనే వీడియో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది.. రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్, ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ వీడియోకి ఎక్కడలేని క్రేజ్ సంపాదించి పెట్టింది. ఇక రామ్ చరణ్ వంతు అయిపోవడంతో అందరూ ఎన్టీఆర్ (కొమరం భీమ్)వీడియో కోసం ఎదురుచూస్తున్నారు. మే20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా కొమరం భీమ్‌గా రాజమౌళి ఎన్టీఆర్ ని ఎలా చూపిస్తాడనే ఆసక్తిగా అందరిలోనూ నెలకొంది.

అయితే తాజా సమాచారం మేరకు ఆర్ ఆర్ అర్ నుంచి ఎన్టీఆర్ ఇంట్రో కష్టమే అని తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో ఆఫీస్ అంతా క్లోజ్ అవ్వడంతో ఎన్టీఆర్ వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్స్ తయారు కావడం కష్టంగా మారిందట. దీంతో ఎన్టీఆర్ పుట్టినరోజుకు కొమరం భీమ్ గా ఎన్టీఆర్ లుక్ బయటకు రావడం కష్టమేనని తెలుస్తోంది... అయితే ఇంకా ఎన్టీఆర్ పుట్టినరోజుకి

నెల రోజుల సమయం ఉంది కాబట్టి వేచి చూడాలి. దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కరోనా వైరస్ ప్రభావంతో వాయిదా పడింది. సినిమాని వచ్చే ఏడాది 2021 జనవరి 8 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇక బాహుబలి లాంటి సినిమా తర్వాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడం, ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తుండగా, విజయేంద్రప్రసాద్ కథను అందించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories