logo

'ఆర్ ఆర్ ఆర్' కు ముహూర్తం ఫిక్స్

ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మల్టీస్టారర్ సినిమా 'ఆర్ ఆర్ ఆర్'. రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కనున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

movie RRRmovie RRR

ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మల్టీస్టారర్ సినిమా 'ఆర్ ఆర్ ఆర్'. రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కనున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా ను లాంచ్ చేసి మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసేశారు రాజమౌళి. అయితే రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ పెళ్లి పనుల్లో కొంచెం బిజీగా ఉన్న రాజమౌళి ఇప్పుడు మళ్లీ సెకండ్ షెడ్యూల్ ను త్వరలో మొదలు పెట్టనున్నారు.

కార్తికేయ మరియు జగపతి బాబు మేనకోడలు పూజ ల పెళ్లి అంగరంగ వైభవంగా జైపూర్ లో జరిగిన సంగతి తెలిసిందే. 'ఆర్ ఆర్ ఆర్' హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ మాత్రమే కాక ఇండస్ట్రీలో రాజమౌళి తో సన్నిహితంగా చాలామంది సెలబ్రిటీలు కూడా పెళ్ళిపండుగ లో పాల్గొన్నారు. ఇక రాజమౌళి ప్రస్తుతం తన దృష్టి మొత్తం 'ఆర్ఆర్ఆర్' పైన మాత్రమే పెట్టనున్నాడు. ఈ నెల 19వ తారీకు నుండి రెండవ షెడ్యూల్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఈ సినిమా 2020 లో విడుదల కానుందని తెలిసిన విషయమే.

లైవ్ టీవి

Share it
Top