NTR ఫాన్స్ కి గుడ్ న్యూస్ : రెడీ అవుతున్న కొమరం భీమ్ స్పెషల్ వీడియో!

NTR ఫాన్స్ కి గుడ్ న్యూస్ : రెడీ అవుతున్న కొమరం భీమ్ స్పెషల్ వీడియో!
x
Highlights

బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్.

బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్... తాజాగా సినిమాకి సంబంధించిన టైటిల్(రౌద్రం రణం రుధిరం) ని, మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేస్తూ అందరికి బిగ్ సప్రైజ్ ఇచ్చాడు రాజమౌళి.. ఈ చిత్ర మోష‌న్ పోస్టర్ కూడా ప్రేక్షకుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

ఇక రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో రామ్ చరణ్ పోషిస్తున్న అల్లూరి సీతారామరాజు పాత్రకి సంబంధించి మేకర్స్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్, ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ వీడియోకి ఎక్కడలేని క్రేజ్ సంపాదించి పెట్టింది. ఇక రామ్ చరణ్ వంతు అయిపోవడంతో అందరూ ఎన్టీఆర్ (కొమరం భీమ్)వీడియో కోసం ఎదురుచూస్తున్నారు. మే20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా కొమరం భీమ్‌గా రాజమౌళి ఎన్టీఆర్ ని ఎలా చూపిస్తాడనే ఆసక్తిగా అందరిలోనూ నెలకొంది. అయితే లాక్‌డౌన్‌ కారణంగా అది సాధ్యం అవొచ్చు అంటూ రాజమౌళి అప్పట్లో కామెంట్స్ చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌ బర్త్‌డే గిఫ్ట్‌ను 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీమ్‌ సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌ పాత్రను పరిచయం చేస్తూ ఓ స్పెషల్‌ వీడియో విడుదలయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది.

దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కరోనా వైరస్ ప్రభావంతో వాయిదా పడింది. సినిమాని వచ్చే ఏడాది 2021 జనవరి 8 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇక బాహుబలి లాంటి సినిమా తర్వాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడం, ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తుండగా, విజయేంద్రప్రసాద్ కథను అందించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories