బోయపాటి సినిమాలో విలన్ గా రోజా ?

బోయపాటి సినిమాలో విలన్ గా రోజా ?
x
Roja, Boyapati srinu, Balakrishna
Highlights

సింహ, లెజెండ్ సినిమాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా తెరకేక్కబోతుందన్న సంగతి తెలిసిందే.

సింహ, లెజెండ్ సినిమాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా తెరకేక్కబోతుందన్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే అధికారకంగా ప్రకటించారు కూడా.. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో సినిమా పట్టాలేక్కనుంది. ఇందులో బాలకృష్ణ ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. సింహ, లెజండ్ సినిమాల లాగే ఇందులో కూడా బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తోంది.

అయితే ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కనిపించనున్నారని గతంలో వార్తలు వచ్చాయి. వాటిపైన చిత్ర యూనిట్ కూడా ఏమీ స్పందిచలేదు. అయితే తాజాగా ఈ సినిమాలో బాలకృష్ణకి ప్రతినాయకురాలిగా రోజా కనిపించనున్నారని టాలీవుడ్ లో ఓ వార్త హాల్ చల్ చేస్తోంది. కానీ దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు. టాలీవుడ్ లో బాలకృష్ణ, రోజాలది మంచి కాంబినేషన్.. గతంలో వీరి కలయికలో వచ్చిన సినిమాలు అన్ని మంచి విజయాన్ని సాధించి హిట్టు పెయిర్ గా వీరికి మంచి పేరును తీసుకువచ్చాయి.

ఇక రామ్ చరణ్ తో బోయపాటి చేసిన వినయ విధేయ రామ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీనితో చాలా గ్యాప్ తీసుకున్న బోయపాటి పక్కా స్క్రిప్ట్ తో బాలకృష్ణతో సినిమా చేయనున్నాడు. ఇందులో వేదిక హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం..

ప్రస్తుతం బాలకృష్ణ కేయస్ రవికుమార్ దర్శకత్వంలో రూలర్ అనే సినిమాని చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన చిత్ర టిజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇందులో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. సోనాలి చౌహాన్, వేదికలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు. క్రిస్మస్ సందర్బంగా సినిమాని డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories