కేఏ పాల్ వీడియోని షేర్ చేసిన ఆర్జీవీ ...

RGV and ka paul
x
RGV and ka paul
Highlights

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అంటే తెలియని వారు బహుశా ఉండరేమో.. గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అయన చేసిన హడావుడి అలాంటిది మరి.. తాజాగా అయన చేసిన ఓ...

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అంటే తెలియని వారు బహుశా ఉండరేమో.. గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అయన చేసిన హడావుడి అలాంటిది మరి.. తాజాగా అయన చేసిన ఓ వీడియోని దర్శకడు రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసాడు. అందులో కేఏ పాల్ మాట్లాడుతూ " మూడో ప్రపంచ యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయని, ఆ యుద్దాన్ని ఆపేందుకు ఇప్పుడు ఏడూ ప్రపంచ దేశాలకి సంబంధించిన దేశాధినేతలను కలిసానని చెప్పుకొచ్చాడు కేఏ పాల్..

త్వరలోనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు లేఖ కూడా రాయబోతున్నానని వెల్లడించారు. అందుకే తానూ రెగ్యులర్ గా షోలో కనిపించడం లేదని క్షమాపణలు కోరారు.." ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దీనిని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ దండాలు అంటూ సెటైరికల్‌గా కామెంట్ చేశారు... ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాలో కేఏ పాల్ కి సంబంధించిన ఓ పాటని వర్మ విడుదల చేసిన సంగతి తెలిసిందే..



Show Full Article
Print Article
More On
Next Story
More Stories