హైదరాబాద్ లో నా ఆఫీస్ .. సైకిల్ చైన్ గన్ మధ్య నా డెన్

RGV office
x
RGV office
Highlights

వర్మ... ఎం మాట్లాడినా ఎం చేసినా ఓ సెన్సేషన్ అనే చెప్పాలి. శివ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు వర్మ.. అప్పట్లో ఈ సినిమాకి ఎంత పేరు వచ్చిందో...

వర్మ... ఎం మాట్లాడినా ఎం చేసినా ఓ సెన్సేషన్ అనే చెప్పాలి. శివ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు వర్మ.. అప్పట్లో ఈ సినిమాకి ఎంత పేరు వచ్చిందో దర్శకుడిగా వర్మ కూడా అంతే పేరు వచ్చింది. ఆ తర్వాత నాగార్జున శ్రీదేవితో కలిసి వర్మ తీసిన గోవిందా గోవిందా సినిమా అనుకున్నంత హిట్టు కాకపోవడంతో తెలుగు ప్రేక్షకులకి సినిమాలు చూడడం రాదని పెద్ద పెద్ద కామెంట్స్ చేసి ముంబైకి వెళ్ళిపోయాడు వర్మ..

ముంబై లోనే ఆఫీస్ తెరిచి సినిమాలు చేస్తూ అక్కడే సెట్ అయిపోయాడు. సినిమాలు కూడా మంచి హిట్టు అయ్యాయి. ఆ తర్వాత ఫ్లాప్ లు వెంటాడాయి. మళ్ళీ తనకి గుర్తింపు తెచ్చిన తెలుగు ఇండస్ట్రీ వైపు అడుగులు వేశాడు. తెలుగులో సినిమాలు తీయడం మొదలు పెట్టాడు. ఇలా సినిమా సినిమాకి సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వర్మ దర్శకుడి కంటే వివాదాలకి కేర్ ఆఫ్ గా మారిపోయాడు.

ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే తాజాగా వర్మ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసాడు. `నా హైదరాబాద్‌ ఆఫీస్‌ బయట లుక్‌, ఆ సైకిల్ చైన్‌, గన్‌కు మధ్య ఉన్న కిటికీలోనే నా డెన్‌` అంటూ పోస్ట్ చేసాడు వర్మ.. వర్మ గతంలో ముంబైలోని తన ఆఫీస్ లో ఉంటూ తెలుగు సినిమాలపైన ఫోకస్ చేసేవాడు. ఇప్పుడు ఏకంగా హైదరాబాదు లో ఓ ఆఫీస్ ఓపెన్ చేసాడు వర్మ.. మరి ఇక్కడ ఉండి మరెన్ని సంచనాలు క్రియేట్ చేస్తాడో చూడాలి మరి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories