'చిరంజీవి - వర్మ' సినిమా ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

చిరంజీవి - వర్మ సినిమా ఎందుకు ఆగిపోయిందో తెలుసా?
x
Highlights

శివ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. అప్పటికి ఓ మూస దోరణిలో వెళ్తున్న తెలుగు సినిమాలను

శివ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. అప్పటికి ఓ మూస దోరణిలో వెళ్తున్న తెలుగు సినిమాలను ఈ సినిమాతో పూర్తిగా మార్చేశాడు వర్మ.. ఇంకా చెప్పాలి అంటే తెలుగు సినిమా చరిత్రను శివకి ముందు.. శివకి తరువాత అనేలాగా మార్చేశాడు వర్మ .ఆ సినిమాలో నాగార్జున సైకిల్ చైన్ తెంపి సీన్ ఇప్పటికి ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి.

ఇక అదే సమయంలో చిరంజీవి మంచి మాస్ ఫాలోయింగ్ తో సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ గా ఎదుగుతున్న రోజులవి. వీరి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తే బాగుండని అనుకోని అభిమాని ఉండడు కావచ్చు. ఆ సమయం రానే వచ్చింది ఇద్దరి మధ్య ఓ స్క్రిప్ట్ కూడా కుదిరింది. ఓ రెండు సాంగ్స్ ని కూడా వర్మ చిత్రీకరించాడు కూడా.. కానీ షూటింగ్ జరుగుతున్న సమయంలో చిరంజీవి స్క్రిప్ట్ విషయంలో కొంత మార్చాలని దర్శకుడు వర్మని కోరారట! కానీ దానికి వర్మ నిరాకరించడంతో ఈ చిత్రం మధ్యలొనే ఆగిపోయిందట!

ఈ సినిమాకి వినాలని ఉంది అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. టబు హీరోయిన్, అశ్వినీదత్ నిర్మాత.. ఆ తర్వాత చిరంజీవి గుణశేఖర్ దర్శకత్వంలో చూడాలని ఉంది అనే సినిమాని చేశాడు. ముందుగా అనుకున్న రెండు పాటలను ఈ సినిమాలో వాడారు. మణిశర్మ సంగీతం అందించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత వర్మ, చిరంజీవి కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా రాలేదు.

ఇక ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ తాజాగా కోకాపేటలో మొదలైంది. ఈ సినిమాలో చిరు సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. సమ్మర్ లో సినిమాని రిలీజ్ చేయనున్నారు. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories