logo

నా మాటే శాసనం : బిగ్ బాస్ హోస్ట్ గా రమ్యకృష్ణ అదుర్స్

నా మాటే శాసనం : బిగ్ బాస్ హోస్ట్ గా రమ్యకృష్ణ అదుర్స్
Highlights

బిగ్ బాస్ చరిత్రలో ఓ లేడి హోస్ట్ గా చేసింది ఎక్కడ కూడా లేదు . కానీ అ లక్కీ ఛాన్స్ ను కొట్టేసింది నటి...

బిగ్ బాస్ చరిత్రలో ఓ లేడి హోస్ట్ గా చేసింది ఎక్కడ కూడా లేదు . కానీ అ లక్కీ ఛాన్స్ ను కొట్టేసింది నటి రమ్యకృష్ణ ... స్పెయిన్ లో నాగార్జున తన బర్త్ డే వేడుకలను తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుండడంతో ఆయన ప్లేస్ లో స్పెషల్ హోస్ట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు శివగామిదేవి ... శనివారం ఎప్పటిలాగే షో ప్రారభం కాగానే నేను మీ నాగార్జున అంటూ కనిపించి అందరిని పలకరించాడు నాగ్ . పుట్టిన రోజు వేడుకల కోసం స్పెయిన్ కి వచ్చానని, మళ్ళీ ఎప్పటిలాగే వచ్చేవారం నుండి యధావిధిగా షో ప్రారంభిస్తానని నాగ్ చెప్పాడు .. నేను అందుబాటులో లేకపోవడంతో ఎవరిని హోస్ట్ గా పెట్టాలి అన్నప్పుడు నాకు వచ్చిన ఒకే ఒక్క పేరు క్వీన్ అనగానే రమ్యకృష్ణ ఎంట్రీ ఇచ్చారు .

వస్తు వస్తూనే నా మాటే శాసనం అనే డైలాగ్ తో అలరించారు . " మనకి ఇష్టమైన వాళ్ళు ఏదైనా అడిగితే మనం ఏది కాదనలేం ... నాగ్ నాకు ఆప్తుడు ,మంచి మిత్రుడు, మంచి ఫిలాసఫర్ అంటూ విష్ యు హ్యాపీ బర్త్ డే నాగ్" అని చెప్పి షో ని మొదలు పెట్టింది రమ్యకృష్ణ ... బాహుబలి సినిమాలో రాజ్యాన్ని ఎలా అయితే హుందాగా నడిపిందో అంతే హుందాతనంతో బిగ్ బాస్ హౌస్ ని కూడా నడిపించింది . నా మాటే శాసనం అని ఒక్కోసారి గద్దరించింది కూడా ... బాబా భాస్కర్ నేను నాగార్జున లాగా కాదు ..నేను చెప్పిందే వినాలని వార్నింగ్ కూడా ఇచ్చింది . ఇంటి సభ్యుల బీహేవియర్ ని చూసి వారి మధ్య సాగిన సన్నివేశాలను చూసి రమ్యకృష్ణ బాగా ఎంజాయ్ చేసారు .



లైవ్ టీవి


Share it
Top