పవన్ సినిమాలో రేణు దేశాయ్?

పవన్ సినిమాలో రేణు దేశాయ్?
x
Highlights

పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.. బాలీవుడ్ పింక్ రీమేక్ లో పవన్ నటిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.. బాలీవుడ్ పింక్ రీమేక్ లో పవన్ నటిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమాని దిల్ రాజు, బోని కపూర్ కలిసి నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకి లాయర్ సాబ్ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమాని మే 23 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది.

ఈ సినిమాలో పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఓ కీలకపాత్రలో కనిపించనుందని వార్తలు వస్తున్నాయి. పవన్ , రేణు దేశాయ్ మొదటిసారిగా బద్రి సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత జానీ సినిమాతో జోడీ కట్టారు. ఇక ఈ జంట మళ్ళీ కనిపించింది లేదు. ఇక ఆ తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరు విడిపోయారు. అయితే ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్ ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చేందుకు దర్శకుడు వేణు శ్రీరామ్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

సినిమాలో భాగంగా వచ్చే చైల్డ్ బ్యాక్ డ్రాప్ సన్నివేశాలలో ఆమె ఆ చైల్డ్ ఆర్టిస్ట్‌కి తల్లిగా కనిపించనున్నారని తెలుస్తోంది. కానీ దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు. ప్రస్తుతం రేణు దేశాయ్ దర్శకురాలిగా వ్యవసాయం, రైతులు కాన్సెప్ట్ తో ఓ సినిమాని తెరకేక్కిస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యమైన పాత్రల్లో ఉంటే నటించేందుకు సిద్దేమేనని ఇప్పటికే రేణు దేశాయ్ ప్రకటించారు కూడా.. తాజాగా వచ్చిన 'చూసీ చూడంగానే' చిత్రంలో తల్లి క్యారెక్టర్‌ చేసే అవకాశం వచ్చినప్పటికీ ఆరోగ్య సమస్యల వలన చేయలేకపోయానిని ఆమె స్వయంగా వెల్లడించాడు.

ఇక పవన్ ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాని చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఇందులో పవన్ స్వాతంత్ర్యసమరయోధుడిగా కనిపించనున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories