logo

నిను వీడని నీడను నేనే విడుదల తేదీ ఖరారు

నిను వీడని నీడను నేనే విడుదల తేదీ ఖరారు
Highlights

వెంకటాద్రి టాకీస్, వి స్టూడియోస్, విస్టా డ్రీం మర్చంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం నిను వీడని నీడను...

వెంకటాద్రి టాకీస్, వి స్టూడియోస్, విస్టా డ్రీం మర్చంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం నిను వీడని నీడను నేనే! ఈ సినిమా టీజర్ ఫస్ట్ లిరికల్ సాంగ్ ఇప్పటికే విడుదల అయి ఆకట్టుకున్నాయి. ఇపుడు ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది సినిమా యూనిట్. జూలై 12 న సినిమా విడుదల చేస్తామని చెబుతున్నారు. సందీప్ కిషన్, అన్యసింగ్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకి దర్శకుడు కార్తీక్ రాజు.

థ్రిల్లర్ జోనర్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కోసం విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది.

పోసాని, మురళీ శర్మ, పూర్ణిమ భాగ్యరాజ్, ప్రగతి, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి కెమెరా : పికె వర్మ, ఎడిటింగ్ : ప్రవీణ్ కెఎల్, సంగీతం : ఎస్ఎస్ థమన్, ఆర్ట్ : విదేష్, స్టంట్స్ : వెంకట్.


లైవ్ టీవి


Share it
Top