Top
logo

వికారాబాద్ వెళ్లిన డిస్కోరాజా

వికారాబాద్ వెళ్లిన డిస్కోరాజా
X
Highlights

మాస్ మహారాజ్ రవితేజ డిస్కోరాజా గా మెరవబోతున్నాడు. గత కొన్ని రోజులుగా సరైన సక్సెస్ లేక ఇబ్బందులు...

మాస్ మహారాజ్ రవితేజ డిస్కోరాజా గా మెరవబోతున్నాడు. గత కొన్ని రోజులుగా సరైన సక్సెస్ లేక ఇబ్బందులు పడుతున్న రవితేజ ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నాడు. ఇపుడు డిస్కోరాజా శరవేగంగా ముస్తాబవుతున్నాడు. హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ తో బిజీగా ఉన్నాడు డిస్కోరాజా. రెండో షెడ్యూల్ లో భాగంగా రామోజీ ఫిలిం సిటీలో కొన్ని సన్నివేశాల్ని రెండురోజుల క్రితం వరకూ చిత్రీకరించారు. వెన్నెల కిశోరె, రవితేజాల మధ్య వచ్చే హాస్య సన్నివేశాల్ని ఈ సందర్బంగా తెరకెక్కించారు. ఇప్పుడు సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల కోసం వికారాబాద్ బయలుదేరాడు డిస్కోరాజా..

ఈ సినిమాకి ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేమ్ వీ ఐ ఆనంద్ దర్శకత్వం చేస్తున్నారు. పాయల్ రాజపుట్, నభా నటేష్ హీరోయిన్లు. ఎస్సార్టీ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై రామ్ తాళ్లూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.



Next Story