నిర్మాతగా మాస్ రాజా?

నిర్మాతగా మాస్ రాజా?
x
Highlights

స్టార్స్ నుంచి చిన్న హీరోల వరకు ప్రతి ఒక్కరు హీరోగా సినిమాలు చేసుకుంటూనే నిర్మాణ రంగం వైపు అడుగులు వేస్తున్నారు.

స్టార్స్ నుంచి చిన్న హీరోల వరకు ప్రతి ఒక్కరు హీరోగా సినిమాలు చేసుకుంటూనే నిర్మాణ రంగం వైపు అడుగులు వేస్తున్నారు. మహేష్ బాబు, నాని, విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ లు మంచి సక్సెస్ అయినవాళ్లే. ఇందులో కొందరు తమ సినిమాలకి నిర్మాణ భాద్యతలు చేపడుతుంటే మరికొందరు కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ తక్కువ బడ్జెట్ లో సినిమాలని నిర్మించి మంచి సక్సెస్ లను అందుకుంటున్నారు.

ఇక ఇప్పుడు ఈ జాబితాలోకి మాస్ మహారాజా రవితేజ కూడా చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు హీరోగా సినిమాలు చేశామా, రెమ్యునరేషన్ తీసుకున్నమా అన్నట్టుగా ఉన్న రవితేజ ఇప్పుడు ప్రొడక్షన్ వైపు అడుగులు వేస్తున్నాడు. చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని సినిమాలు చూసి నచ్చితే ఫోన్ చేసి ఎంకరేజ్ చేస్తుంటాడు రవితేజ. ఈ మధ్య కొత్త దర్శకులు కొత్త కథలతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో రవితేజ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ చిన్న చిన్న సినిమాలను తెరకెక్కించాలని ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. త్వరలో దీనిపైన అధికార ప్రకటన వెలువడనుంది.

ప్రస్తుతం రవితేజ డిస్కోరాజా అనే సినిమాని చేస్తున్నాడు. ఎక్కడికి పోతావ్ చిన్నవాడా ఫేం వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో రవితేజ సరసన నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రామ్ తాళ్లూరి సినిమాని నిర్మిస్తున్నారు. సైన్స్ పిక్షన్ బ్యాక్ గ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ మూడు విభిన్నమైన పాత్రలలో నటిస్తున్నాడు. సినేమపైన మంచి అంచనాలు ఉన్నాయి. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత తనతో డాన్‌ శ్రీను, బలుపు సినిమాలను తెరకెక్కించిన గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి క్రాక్‌ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించానున్నాడు. రవితేజ సరసన శృతిహాసన్‌ హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories