ఆర్ ఎక్స్ 100 మహేష్ భూపతి తో రవితేజ?

ఆర్ ఎక్స్ 100 మహేష్ భూపతి తో రవితేజ?
x
Highlights

హిట్ కోసం మొహం వాచిపోయిన రవితేజ కొత్త ప్రయత్నాలు మొదలు పెట్టాడని తెలుస్తోంది. తనకు కసితో హిట్ ఇచ్చే దర్శకుడి కోసం ప్రయత్నించిన మాస్ మహారాజ్ రవితేజ...

హిట్ కోసం మొహం వాచిపోయిన రవితేజ కొత్త ప్రయత్నాలు మొదలు పెట్టాడని తెలుస్తోంది. తనకు కసితో హిట్ ఇచ్చే దర్శకుడి కోసం ప్రయత్నించిన మాస్ మహారాజ్ రవితేజ దర్శకుడు అజయ్ భూపతీ వేపు చూస్తున్నాడని సినిమా వర్గాలంటున్నాయి. వైవిధ్యభరితమైన ప్రేమకథా చిత్రాల జాబితాలో ఇటీవల వచ్చిచేరిన 'ఆర్ ఎక్స్ 100' దర్శకుడు భూపతికి ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పటికే నాగ్ చైతన్యతో సినిమాకి కమిట్ అయ్యాడు. అయితే, ఆ సినిమా పట్టాలెక్కేది కష్టమని తెలుస్తోంది. మహాసముద్రంగా పేరు పెట్టుకున్న ఈ సినిమాకి బడ్జెట్ చైతూ మార్కెట్ కంటే ఎక్కువ డిమాండ్ చేస్తోందట. దీంతో ఆ సినిమా ఆగిపోయిందని టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో తనతో సినిమా కోసం ముందుకు వచ్చిన రవితేజ కోసం మంచి మసాలా సినిమా తీయడానికి సై అన్నాడని సమాచారం. ఇప్పటికే కథ షయమై కొంత క్లారిటీ కూడా రవితేజకు భూపతి ఇచ్చాడని, దానికి రవితేజ కూడా సరే అన్నాడని చెప్పుకుంటున్నారు. ఇదే నిజమైతే త్వరలోనే ఈ సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories