మరో చిన్న దర్శకుడికి అవకాశం ఇచ్చిన రవితేజ?

మరో చిన్న దర్శకుడికి అవకాశం ఇచ్చిన రవితేజ?
x
Highlights

ప్రస్తుతం ఒక్కప్పటి లాగా రవితేజ సినిమాలు చేయడం లేదని అయన ఫ్యాన్స్ భాదపడుతున్నారు.కానీ డిస్కో రాజా సినిమా అయిపోయాక వరుస సినిమాలతో బిజీ కానున్నాడు...

ప్రస్తుతం ఒక్కప్పటి లాగా రవితేజ సినిమాలు చేయడం లేదని అయన ఫ్యాన్స్ భాదపడుతున్నారు.కానీ డిస్కో రాజా సినిమా అయిపోయాక వరుస సినిమాలతో బిజీ కానున్నాడు రవితేజ.. ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సిద్దం అయ్యాడు రవితేజ..ఇప్పటికే ఆఫీషల్ గా సినిమా ఉంటుందని అనౌన్స్ కూడా చేసారు. ఇందులో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.

అయితే ఇదే కాకుండా మరో సినిమాకి కూడా రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మేము వయసుకు వచ్చాం, సినిమా చూపిస్తమావ, నేను లోకల్ లాంటి సినిమాలకి దర్శకత్వం వహించిన త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రవితేజ అంగీకరించారని తెలుస్తుంది. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ పై అల్లు అరవింద్ నిర్మిస్తారని సమాచారం..

ఇక డిస్కో రాజా సినిమాని డిసెంబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో రవితేజ సరసన నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ లు గా నటిస్తున్నారు. వి.ఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories