Top
logo

డిస్కోరాజా సెన్సార్ పూర్తి

డిస్కోరాజా సెన్సార్ పూర్తి
X
Highlights

గత కొద్దిరోజులుగా వరుస ప్లాపులతో సతమతం అవుతున్న మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం 'డిస్కోరాజా' అనే సినిమాలో నటిస్తున్నాడు.

గత కొద్దిరోజులుగా వరుస ప్లాపులతో సతమతం అవుతున్న మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం 'డిస్కోరాజా' అనే సినిమాలో నటిస్తున్నాడు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ మూడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రామ్ తాళ్లూరి సినిమాని నిర్మిస్తున్నారు.

సైన్స్ పిక్షన్ బ్యాక్ గ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ మూడు విభిన్నమైన పాత్రలలో నటిస్తున్నాడు. సినిమాపైన మంచి అంచనాలు ఉన్నాయి. తమన్ సంగీతం అందిస్తున్నాడు. రామ్ తాళ్లూరి సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు రిలీజ్ చేసిన రెండు టీజర్స్, పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ ను జారీ చేసింది.

ఇక సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ నిన్న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ వేడుకలో రవితేజ సినిమా కచ్చితంగా ఆడుతుందని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చాడు. ఇక ఇదే వేడుకలో ట్రైలర్ విడుదల చేస్తారేమోనని అంతా భావించారు కానీ ట్రైలర్ కి బదులు మేకింగ్ వీడియోని మాత్రం వదిలారు చిత్రబృందం . ఇక రాజా ది గ్రేట్ సినిమా తర్వాత రవితేజ నుంచి మంచి హిట్టు లేకపోవడంతో ఫ్యాన్స్ మంచి అంచనాలు పెట్టుకున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత తనతో డాన్‌ శ్రీను, బలుపు సినిమాలను తెరకెక్కించిన గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి క్రాక్‌ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించానున్నాడు. రవితేజ సరసన శృతిహాసన్‌ హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Web TitleRaviteja discoraja censor completed
Next Story