డిస్కోరాజా కలెక్షన్స్ అదిరిపోయాయి!

డిస్కోరాజా కలెక్షన్స్ అదిరిపోయాయి!
x
Highlights

ఈ ఏడాది తెలుగు సినిమాలు ఉహించని కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నాయి.

ఈ ఏడాది తెలుగు సినిమాలు ఉహించని కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నాయి. ఇప్పటికే మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో చిత్రాలు మంచి విజయాన్ని అందుకొని కలెక్షన్ల సునామిని సృష్టిస్తున్నాయి. ఇప్పుడు వాటికీ తోడుగా రవితేజ 'డిస్కోరాజా' ఆ ఊపును కొనసాగిస్తోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజైన ఈ సినిమా మొదటిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.80కోట్ల షేర్ ను రాబట్టిదని తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో డిస్కోరాజా మొదటి రోజు వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయని అంచనా :

నైజాం - 1.05 కోట్లు

సీడెడ్ - 0.36 కోట్లు

ఉత్తరాంద్ర - 0.30 కోట్లు

గుంటూరు -0.17 కోట్లు

తూర్పు గోదావరి - 0.19 కోట్లు

పశ్చిమ గోదావరి - 0.15 కోట్లు '

కృష్ణా - 0.18 కోట్లు

నెల్లూరు - 0.10 కోట్లు

తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు షేర్ = 2.80కోట్లు

ఇక ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.5 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని సమాచారం.

విడుదలకి ముందు ఈ చిత్రం రూ.22 కోట్ల బిజినెస్ చేసిందని తెలుస్తోంది.. ఇక ఓవర్సీస్, ఇండియాలోని ఇతర ప్రాంతాల్లో కలుపుకుని రూ. రూ.3.1 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం.

వి ఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించారు రవితేజ. ఇందులో రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్ , నభా నటేష్ నటించారు. తమన్ సంగీతం అందించగా, రామ్ తాళ్లూరి సినిమాని నిర్మించారు. బాబీ సింహ ప్రధాన పాత్రలో నటించాడు. సినిమాకి మంచి టాక్ రావడంతో చిత్ర యూనిట్ నిన్న హైదరాబాదులో సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసింది.

ఇక ఈ సినిమా తర్వాత తనతో డాన్‌ శ్రీను, బలుపు సినిమాలను తెరకెక్కించిన గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి క్రాక్‌ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించానున్నాడు. రవితేజ సరసన శృతిహాసన్‌ హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories