ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అన్నాడు కానీ సక్సెస్ చేసి చూపించా : రవిబాబు

ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అన్నాడు కానీ సక్సెస్ చేసి చూపించా : రవిబాబు
x
Highlights

విభిన్నమైన పాత్రల్లో నటించి మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు రవిబాబు. ఆ తర్వాత దర్శకుడుగా మారి విభిన్నమైన చిత్రాలకు దర్శకత్వం వహించి తనకంటూ ఓ...

విభిన్నమైన పాత్రల్లో నటించి మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు రవిబాబు. ఆ తర్వాత దర్శకుడుగా మారి విభిన్నమైన చిత్రాలకు దర్శకత్వం వహించి తనకంటూ ఓ మార్క్ ను సొంతం చేసుకున్నాడు.. అల్లరి సినిమాతో దర్శకుడుగా మారినా రవిబాబు ప్రస్తుతం ఆవిరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాని దిల్ రాజు సమర్పిస్తున్నారు...ఈ సినిమా ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిబాబు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.. దర్శకుడుగా అల్లరి సినిమాని చేస్తున్న సమయంలో జరిగిన సంఘటనని చెప్పుకొచ్చారు రవిబాబు.. "అల్లరి సినిమాని కొత్తగా రుపోదించాలని అనుకున్నాను. అనుకున్నా టైంకి అనుకున్నా బడ్జెట్ లో సినిమాని తీశాను. కానీ నా తోటి ప్రొడ్యూసర్ అయిన వ్యక్తి ఈ సినిమా నచ్చలేదు. సినిమా చాలా చెత్తగా వుంది అనవసరంగా తీశాము తప్పకుండా ఫ్లాప్ అవుతుందని అన్నాడు. కానీ నాకు మాత్రం సినిమాపైన నమ్మకం ఉంది . చివరికి నేను అనుకున్నా నా జడ్జిమెంట్ నిజం అయి సినిమా సక్సెస్ అయింది" అంటూ రవిబాబు చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories