ఆవిరి కథకి ఆమ్రపాలికి లింక్.. రవిబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ఆవిరి కథకి ఆమ్రపాలికి లింక్.. రవిబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
x
Highlights

వైవధ్యమైన కథలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు దర్శకుడు రవిబాబు .. అందులో భాగంగా అనసూయ, అవును లాంటి సినిమాలు వచ్చాయి. తాజాగా...

వైవధ్యమైన కథలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు దర్శకుడు రవిబాబు .. అందులో భాగంగా అనసూయ, అవును లాంటి సినిమాలు వచ్చాయి. తాజాగా అయన ఆవిరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాని దిల్ రాజ్ సమర్పిస్తున్నారు. నవంబర్ 01 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే విడుదలైన సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే తాజగా సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ప్రముఖ యుట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిబాబు సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. " అదుగో సినిమా చేస్తున్న సమయంలో టీవీలో వరంగల్ జిల్లాకి కలక్టర్ గా పనిచేస్తున్న ఆమ్రపాలి గురించి ఓ న్యూస్ వచ్చింది. అందులో తన కలెక్టరేట్ భవనంలో దెయ్యం ఉందని, అటు వైపు వెళ్లడానికి తనకు భయమేస్తుందనే వార్తలు వచ్చాయి. అయితే ఆ న్యూస్ ని బేస్ చేసుకొని ఆవిరి కథను డెవలప్ చేసానని రవిబాబు చెప్పుకొచ్చాడు"

.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories