Ravi Teja: 'డిస్కోరాజా' ప్రీ రిలీజ్ బిజినెస్

Ravi Teja: డిస్కోరాజా  ప్రీ రిలీజ్ బిజినెస్
x
Highlights

గత కొద్దిరోజులుగా వరుస ప్లాపులతో సతమతం అవుతున్న మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం 'డిస్కోరాజా' అనే సినిమాలో నటిస్తున్నాడు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో...

గత కొద్దిరోజులుగా వరుస ప్లాపులతో సతమతం అవుతున్న మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం 'డిస్కోరాజా' అనే సినిమాలో నటిస్తున్నాడు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ మూడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రామ్ తాళ్లూరి సినిమాని నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందించాడు. ఈ సినిమాని గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 24 న రిలీజ్ చేయనున్నారు. సైన్స్ పిక్షన్ బ్యాక్ గ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపైన మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ ను జారీ చేసింది. ఈ సినిమాకి కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది.

నైజాం : 6 కోట్లు

వైజాగ్ : 1.95 కోట్లు

తూర్పు గోదావరి : 1.25 కోట్లు

పచ్చిమ గోదావరి : 1.05 కోట్లు

కృష్ణ : 1.25 కోట్లు

గుంటూరు : 1.5 కోట్లు

నెల్లూరు : 0.65 కోట్లు

సీడెడ్ : 2.75 కోట్లు

రెండు తెలుగు రాష్ట్రాలలో 16.4 కోట్లు

కర్ణాటక : 1.10 కోట్లు

ఓవర్సీస్ : 1.5 కోట్లు

రెస్ట్ అఫ్ ఇండియా : 0.5 కోట్లు

ప్రపంచ వ్యాప్తంగా ధియేట్రికల్ బిజినెస్ 22 కోట్ల వరకు జరిగినట్టుగా సమాచారం. ఈ సినిమా 33 కోట్లు సాధిస్తే బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలుస్తోంది. ఇక రాజా ది గ్రేట్ సినిమా తర్వాత రవితేజ నుంచి మంచి హిట్టు లేకపోవడంతో ఫ్యాన్స్ ఈ సినిమాపైన అంచనాలు పెట్టుకున్నారు. విడుదలైన టీజర్స్ సినిమాపైన మంచి అంచనాలను కలగజేశాయి.

ఇక ఈ సినిమా తర్వాత తనతో డాన్‌ శ్రీను, బలుపు సినిమాలను తెరకెక్కించిన గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి క్రాక్‌ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించానున్నాడు. రవితేజ సరసన శృతిహాసన్‌ హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ వార్తను ఇంగ్లిష్ లో చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories