Krack Teaser : రవితేజ మీసాన్ని శృతిహాసన్ కాలితో మెలితిప్పేసింది!

Krack Teaser : రవితేజ మీసాన్ని శృతిహాసన్ కాలితో మెలితిప్పేసింది!
x
Highlights

డాన్ శీను, బలుపు లాంటి హిట్స్ తర్వాత హీరో రవితేజ, దర్శకుడు పీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ అనే సినిమా తెరకెక్కుతుంది. శ్రుతిహాసన్ హీరోయిన్ గా...

డాన్ శీను, బలుపు లాంటి హిట్స్ తర్వాత హీరో రవితేజ, దర్శకుడు పీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ అనే సినిమా తెరకెక్కుతుంది. శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ కి మంచి క్రేజ్ వచ్చేసింది. విక్రమార్కుడు సినిమా తర్వాత రవితేజ మళ్ళీ పోలీస్ గెటప్ లో కనిపిస్తుండడంతో సినిమాపైన మంచి బజ్ ఏర్పడింది. అయితే ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా సినిమాకి సంబంధించిన టీజర్ ని చిత్రబృందం విడుదల చేసింది.

నిమిషం పదకొండు సేకేండ్స్ ఉన్న చిత్ర టీజర్ ప్రేక్షకులను వీపరితంగా ఆకట్టుకుంది. "ఒంగోల్‌లో రాత్రి ఎనిమిది గంటలకు కరెంట్ పోయిందంటే కచ్ఛితంగా మర్డరే.. అనే వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ అయిన టీజర్ మొత్తం ఉత్కఠభరితంగా సాగింది. దాదాపుగా చిత్ర టీజర్ మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్ తో నిండిపోయింది. వరలక్ష్మి శరత్‌కుమార్‌, సముద్రఖని కీలక పాత్రలుగా కనిపిస్తున్నారు. ఇక టీజర్ చివర్లో అప్పిగా, తుప్పిగా, నువ్వు ఎవరైతే నాకేంట్రా డొప్పిగా'.. అంటూ తనదైన మ్యానరిజంతో ఆకట్టుకున్నారు రవితేజ.. ఇక ఈ టీజర్‌లో రవితేజ మీసాన్ని తన కాలితే శృతి హాసన్ మెలితిప్పే సీన్‌ హైలైట్‌గా నిలిచింది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా వేసవి కానుకగా మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. సరస్వతి ఫిల్మ్స్‌ డివిజన్‌ పతాకంపై బి.మధు ఈ సినిమాను నిర్మిస్తుండగా, తమన్ సంగీతం అందించాడు.

ఇక ఈ సినిమా అనంతరం రమేష్ వర్మ దర్శకత్వంలో మరో సినిమాని చేస్తున్నాడు రవితేజ... గతంలో వీరి కాంబినేషన్ లో వీర అనే సినిమా వచ్చింది. తాజాగా రమేష్ వర్మ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో రాక్షసుడు అనే సినిమాని తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories