Tollywood గోల్డెన్ లెగ్ గా రష్మిక..

Tollywood గోల్డెన్ లెగ్ గా రష్మిక..
x
Rashmika Mandanna (File Photo)
Highlights

వరుస సక్సెస్ లతో దూసుకుపోతుంది హీరోయిన్ రష్మిక మందన్నా..ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ భామేదే హవా.. ఏ వేడుక చూసిన, ఏ సినిమా చూసిన అందరూ రష్మిక జపం చేస్తున్నారు.

వరుస సక్సెస్ లతో దూసుకుపోతుంది హీరోయిన్ రష్మిక మందన్నా..ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ భామేదే హవా.. ఏ వేడుక చూసిన, ఏ సినిమా చూసిన అందరూ రష్మిక జపం చేస్తున్నారు. నాగశౌర్య హీరోగా వచ్చిన ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ కన్నడ బ్యూటి వరుస సక్సెస్ లతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. తాజాగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు, భీష్మ సక్సెస్ లతో రష్మిక మందన్నా ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపొయింది. ఇంకా చెప్పాలంటే ఆమె ఉంటే చాలు సినిమా సక్సెస్ అన్న సెంటిమెంట్ టాలీవుడ్ లో బాగా పెరిగిపోయింది.

సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా వచ్చిన మెగస్టార్ చిరంజీవి రష్మిక గురించి మాట్లడుతూ.. ఎక్కడ చూసిన నువ్వే కనిపిస్తున్నావ్ ఏంటమ్మా .. నన్నేమైనా కాంట్రాక్ తీసుకున్నవా అన్నారంటే రష్మిక గురించి కామెంట్స్ చేయడం, ఇక తాజాగా భీష్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా వెళ్ళిన త్రివిక్రమ్ కూడా రష్మిక ను తెలుగు ఇండస్ట్రీ ఇంకా చాలా సంవత్సరాలు పాటు చూస్తుందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ప్రముఖ నిర్మాత దిల్ రాజు భీష్మ సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ.. రష్మిక లెగ్ మహిమ.. ఆమె ఏ సినిమా చేసిన హిట్ అవుతుందని పొగడ్తలతో ముచేత్తాడు..

ఇప్పటివరకు ఆరు తెలుగు సినిమాలు చేసిన రష్మిక అందులో నాలుగు బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంది. ఇందులో రెండు సినిమాలు వంద కోట్ల సినిమాలు ఉండడం విశేషం.. ప్రస్తుతం రష్మిక ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకేక్కబోయే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాకుండా అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకేక్కబోయే సినిమాలో కూడా రష్మికనే నటిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories