ఆమె ఎలాంటిదో నాకు అంతా తెలుసు... బిగ్ బాస్ తప్పనిసరిగా గెలుస్తుంది !

ఆమె ఎలాంటిదో నాకు అంతా తెలుసు... బిగ్ బాస్ తప్పనిసరిగా గెలుస్తుంది !
x
Highlights

బిగ్ బాస్ 3 చివరి దశకు చేరుకుంది. మరో పది రోజుల్లో ఈ షో ముగియనుంది. పదహారు మందితో మొదలైన ఈ షోలో ఇప్పుడు ఆరుగురు మాత్రమే మిగిలారు. గత రెండు సిజన్స్ తో...

బిగ్ బాస్ 3 చివరి దశకు చేరుకుంది. మరో పది రోజుల్లో ఈ షో ముగియనుంది. పదహారు మందితో మొదలైన ఈ షోలో ఇప్పుడు ఆరుగురు మాత్రమే మిగిలారు. గత రెండు సిజన్స్ తో పోల్చుకుంటే ఈ సీజన్ ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేదని చెప్పాలి.. అయితే మిగిలిన ఆరుగురులో ఎవరు విన్నర్ గా అవుతారు అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఇప్పటికే రాహుల్ ఫైనల్ కి చేరిపోయిన సంగతి తెలిసిందే.. దీనితో ఎవరి ఫాన్స్ వారికే సపోర్ట్ చేస్తూ విజయం సాధించాలని కోరుకుంటున్నారు.

అందులో భాగంగానే శ్రీముఖి విజయం సాదించడం పక్కా అని ఆమె ఫాన్స్ కూడా బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ యాంకర్ రష్మి గౌతమ్ బిగ్ బాస్ లోని శ్రీముఖికి సపోర్ట్ గా నిలిచింది. శ్రీముఖి ఎలాంటిదో నాకు తెలుసునని, బయట ఎలా ఉంటుందో బిగ్ బాస్ హౌస్ లో కూడా అలాగే ఉంటుందని చెప్పుకొచ్చింది రష్మి.. తనని బిగ్ బాస్ విన్నర్ గా చూడాలని ఉందని చెప్పుకొచ్చింది రష్మి.. జబర్దస్త్ యాంకర్ రష్మి రూపంలో శ్రీముఖికి సపోర్ట్ దొరకడంతో ఆమె ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories