logo
సినిమా

అభిమానుల పైకి దూకిన హీరో.. మహిళలకు గాయాలు

అభిమానుల పైకి దూకిన హీరో.. మహిళలకు గాయాలు
X
Highlights

షూటింగులో అయినా..బయట అయినా ఎప్పుడు ఫుల్ జోష్ గా కనిపించే బాలీవుడ్‌ హీరో రణవీర్‌ సింగ్ చర్యలు చాలా సందర్భాల్లో...

షూటింగులో అయినా..బయట అయినా ఎప్పుడు ఫుల్ జోష్ గా కనిపించే బాలీవుడ్‌ హీరో రణవీర్‌ సింగ్ చర్యలు చాలా సందర్భాల్లో వివాదాస్పదం అవుతుంటాయి. తాజాగా అతను చేసిన విన్యాసానికి కొందరు మహిళలు గాయపడ్డారు. ప్రస్తుతం రణవీర్‌ సింగ్‌, అలియా భట్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం గల్లీబాయ్‌. ఈ సినిమాలో రణవీర్‌.. రాప్‌ గాయకుడిగా ఎదగాలనుకునే కుర్రాడి పాత్రలో కనిపిస్తున్నాడు. ప్రేమికుల రోజు కానుకగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది.

ఈసందర్భంగా లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో రణవీర్‌ లైవ్‌ పర్ఫామెన్స్‌ ఇచ్చాడు. స్టేజ్‌ మీద పాటపాడుతూ ఒక్కసారిగా ఎదురుగా ఉన్న అభిమానులపైకి దూకేశాడు. దీంతో అక్కడున్న కొంతమంది అభిమానులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఇక రణవీర్‌ సింగ్ చర్యలపై సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. సినిమాల్లోని విన్యాసాలు బయట చేస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

Next Story