రానా పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సురేష్‌ బాబు

రానా పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సురేష్‌ బాబు
x
Highlights

రానా దగ్గుబాటి ప్రేమ, పెళ్లిపై ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత సురేష్‌ బాబు స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడారు. ఈ ఏడాదిలోనే తన కుమారుడు...

రానా దగ్గుబాటి ప్రేమ, పెళ్లిపై ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత సురేష్‌ బాబు స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడారు. ఈ ఏడాదిలోనే తన కుమారుడు రానా వివాహం జరగబోతోందని సురేష్‌ బాబు తెలిపారు. రానా, మిహీకా ఒకరికొకరు చాలా కాలంగా తెలుసని సురేశ్ బాబు తెలిపారు. వారిద్దరూ జీవితంలో ఒకటి కావాలనుకోవడం సంతోషకరమని చెప్పారు. వివాహానికి సంబంధించిన అన్ని విషయాలను సరైన సమయంలో వెల్లడిస్తామని తెలిపారు.

ఈ ఏడాదిలోనే వారి పెళ్లి జరుగుతుంది. డిసెంబర్‌లో పెళ్లి చేయాలని మేము అనుకుంటున్నాం.. కానీ అంతకు ముందే జరిగే అవకాశం కూడా ఉంది. అన్ని ఖరారు అయ్యాక వివరాలు వెల్లడిస్తాం. ఈ లాక్‌డౌన్‌ సమయంలో మేము ఖాళీగా ఉండకుండా.. పిల్లలు మాకు పని కల్పించారని చెప్పారు. పెళ్లి ప్లానింగ్ లో ప్రస్తుతం తామంతా బిజీగా ఉన్నామని తెలిపారు. నిన్న దగ్గుబాటి రానా తన ప్రేయసిని ట్విట్టర్ వేదికగా అందరికి పరిచయం చేశాడు. ఆమె తన ప్రేమకి ఒకే చెప్పిందని, ఆమెకి సంబంధించిన పిక్ తో పాటు ఆమె పేరు మిహీకా బజాజ్ అంటూ రివీల్ చేశాడు రానా.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories