'రాములో రాములా' అంటున్న అల్లు అర్జున్ ...

రాములో రాములా అంటున్న అల్లు అర్జున్ ...
x
Highlights

అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబినేషన్ నుండి వస్తున్న చిత్రం 'అల వైకుంటపురములో '.. పూజా హేగ్దే కథానాయకగా నటిస్తుంది. గీతా ఆర్ట్స్ , హారిక హసిని...

అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబినేషన్ నుండి వస్తున్న చిత్రం 'అల వైకుంటపురములో '.. పూజా హేగ్దే కథానాయకగా నటిస్తుంది. గీతా ఆర్ట్స్ , హారిక హసిని క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. మొదటినుండి సినిమాపైన భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి తోడు సినిమా ఫస్ట్ లుక్, విడుదల చేసిన " సామజవరగమనా" అనే పాట సినిమపైన భారీ అంచనాలను పెంచేసాయి.

ఇప్పటివరకు " సామజవరగమనా" లాంటి సాఫ్ట్ అండ్ మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేసిన చిత్రబృందం ఇప్పుడు 'రాములో రాములా' అంటూ పక్కా మాస్ బీట్ ని బయటకు వదలబోతుంది. దీనిని రేపు (అక్టోబర్ 21న) సాయంత్రం 4.05 గంటలకు సాంగ్ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు బన్నీ స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఇది క్యాచీ సాంగ్ అని, అందరికీ నచ్చుతుందని బన్నీ పేర్కొన్నారు. పూర్తి పాటను దీపావళి రోజున విడుదల చేయనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉంది


Show Full Article
Print Article
More On
Next Story
More Stories