ఆడియో వేడుకల్లో మాకు ప్రాధాన్యత ఉండటం లేదు: రామజోగయ్య శాస్త్రి

ఆడియో వేడుకల్లో మాకు ప్రాధాన్యత ఉండటం లేదు: రామజోగయ్య శాస్త్రి
x
rama jogayya sastry
Highlights

నా పాటలను సోషల్ మీడియాలో పెడుతుంటానని, సాహిత్యనికి సంబధించిన విషయాలను అందులో చర్చిస్తానని చెప్పుకొచ్చారు శాస్త్రి..

తెలుగు గేయ రచయితల్లో రామజోగయ్య శాస్త్రి ఒకరు.. అలవోకగా ఎలాంటి పాట అయిన సరే రాయగలడు అన్న పేరును సంపాదించుకున్నారు అయన..యువసేన సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయిన రామ జోగయ్య శాస్త్రి దాదాపుగా 1200 పైగా పాటలు రాశారు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అయన కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

తానూ రాసిన సినిమా పాటలలో ఖలేజా సినిమాలోని 'ఓం నమశివ రుద్రాయా' అనే పాట చాలా సంతృప్తిని ఇచ్చిందని అన్నరాయాన.. నాకు నచ్చిన పాట కూడా అదేనని, వాస్తవానికి ఈ పాటని సిరివెన్నల సీతారామ శాస్త్రి లాంటి గేయ రచయితలు రాయాల్సిన పాటని, కానీ ఈ అవకాశం నాకు దక్కడం నా అదృష్టమని అన్నారు.

ఇక ఇదే కార్యక్రమంలో లిరిక్ రైటర్స్ కి చిత్రపరిశ్రమలో ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదనీ, రావలసినంత గుర్తింపు కూడా రావడం లేదని నాకు అనిపించిందని అయన అన్నారు. ఇక ఆడియో వేడుకలు మా గురించే అయనప్పటికీ అందులో తగిన గుర్తింపు రావడం లేదని అన్నారు రామజోగయ్య శాస్త్రి.. అందుకే నా పాటలను సోషల్ మీడియాలో పెడుతుంటానని, సాహిత్యనికి సంబధించిన విషయాలను అందులో చర్చిస్తానని చెప్పుకొచ్చారు శాస్త్రి..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories