వర్మ మరో ట్వీట్ .... ఈసారి సాహో ప్రభాస్

వర్మ మరో ట్వీట్ .... ఈసారి సాహో ప్రభాస్
x
Highlights

భీమవరం రోడ్ల పక్కన ప్రభాస్ మీద రాజుల క్యాస్ట్ ఫీలింగ్ చూడండి" అంటూ పోస్ట్ పెట్టాడు . వర్మ ఇంకా ఇలాంటి పోస్ట్లు ఎన్ని పెడతాడో చూడాలి మరి .

ఎప్పుడైతే వర్మ "కమ్మ రాజ్యంలో కడప రెడ్లు" అనే టైటిల్ పెట్టాడో అప్పటినుండి కులాల ప్రస్తావన ఎక్కువగా తీసుకొని వస్తున్నారు . కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా వివాదాస్పదం కాదంటూనే పెద్ద వివాదానికి తెర లేపాడు వర్మ . తాజాగా కులాల గురించి పోస్ట్ పెట్టి మరో సెన్సేషన్ చేసాడు వర్మ ... "నాకు క్యాస్ట్ ఫీలింగ్ అంటే ఇష్టం.అలా ఉండడాన్ని నేను గర్వంగా ఫీల్ అవుతాను . క్యాస్ట్ ఫీలింగ్ అనేది బెటర్ ఫీలింగ్. ఎవరి కులం మీద వాళ్లకున్న ప్రేమను కుల గజ్జి అనే ఒక పరమ నీచ అసహ్యమైన పేరుతో వర్ణించేవారికి ఇదే నా సమాధానం". అంటూ తన వాయిస్ తో ఉన్న ఓ సాంగ్ ని రిలీజ్ చేసాడు వర్మ .

పోనీ ఇది చాలదు అన్నట్టు హీరో ప్రభాస్ ని వాడుకుంటూ "ప్రభాస్ నా కులమే.. అతని సినిమా సాహో కోసం కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నాను . ప్రభాస్ నా కులం వాడు కాబట్టి సినిమా హిట్టు కావాలని కోరుకుంటున్నాని" అన్నాడు వర్మ .. ఇక మళ్ళీ దీనిపైన స్పందిస్తూ భీమవరంలో ఏర్పాటు చేసిన ప్రభాస్ సాహో ఫ్లెక్సిల వీడియోని పోస్ట్ చేస్తూ "భీమవరం రోడ్ల పక్కన ప్రభాస్ మీద రాజుల క్యాస్ట్ ఫీలింగ్ చూడండి" అంటూ పోస్ట్ పెట్టాడు . వర్మ ఇంకా ఇలాంటి పోస్ట్లు ఎన్ని పెడతాడో చూడాలి మరి .



Show Full Article
Print Article
More On
Next Story
More Stories