రాజధాని పక్క రాష్ట్రంలో ఉన్నా పెద్దగా తేడా ఉండదు : వర్మ

రాజధాని పక్క రాష్ట్రంలో ఉన్నా పెద్దగా తేడా ఉండదు : వర్మ
x
RGV
Highlights

నిత్యం ఏదో వాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు వివాదాస్పద దర‌‌‌‌‌్శకుడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా రాజధాని విషయంలో వాఖ్యలు చే‌శారు వర్మ....

నిత్యం ఏదో వాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు వివాదాస్పద దర‌‌‌‌‌్శకుడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా రాజధాని విషయంలో వాఖ్యలు చే‌శారు వర్మ. రాజకీయాలతో సంబంధంలేని ప్రజలకు రాజధాని ఎక్కడున్నా ఒకటేనని అన్నారు. .తాజాగా ఆయన నిర్మించిన సినిమా 'బ్యూటిఫుల్‌' సినిమా ప్రమెషన్ లో భాగంగా విశాఖలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా వర్మను ఏపీ రాజధాని అంశం గురించి అడగగా, ఆయన ఇలా స్పందించారు.

'రాజధాని విషయంపై నాకు ఏ మాత్రం అవగాహన లేదు. రాజధాని పక్క రాష్ట్రంలో ఉన్నా పెద్దగా తేడా ఉండదు. గతంలో ఏపీ రాజధాని అమరావతి గురించి మద్యం మత్తులో ఏదో ట్వీట్ చేశా. ఇప్పుడు మధ్యాహ్నం కాబట్టి, ఆ విషయంపై ఏం మాట్లాడలేను. అప్పుడు కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే అమరావతి గురించి మాట్లాడా. ఇప్పుడు అవగాహనలేని దానిపై నేను మాట్లాడను. మీరు జీవితాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు (విలేకరిని ఉద్దేశిస్తూ), అది ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది నా ఉచిత సలహా' అని వర్మ చెప్పారు.

ఇక 'బ్యూటిఫుల్‌' సినిమా విషయానికి వచ్చేసరికి ఈ సినిమాలో నయనా గంగూలీ మెయిన్ లీడ్ లో నటిస్తోంది. ఈ సినిమాని జనవరి 1న ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన సినిమా పోస్టర్స్, టీజర్ సినిమాపైన భారీ అంచనాలను క్రియేట్ చేసాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories