ఆర్జీవీ నోట కేసీఆర్‌పై పాట

ఆర్జీవీ నోట కేసీఆర్‌పై పాట
x
Highlights

రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం టైగర్ కేసీఆర్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ కాసేపట్లో విడుదల చేయనున్నారు. కేసీఆర్ తెలంగాణ ఉద్య‌మాన్ని ఎలా న‌డిపించారు అన్న...

రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం టైగర్ కేసీఆర్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ కాసేపట్లో విడుదల చేయనున్నారు. కేసీఆర్ తెలంగాణ ఉద్య‌మాన్ని ఎలా న‌డిపించారు అన్న నేప‌థ్యంలో వ‌ర్మ తెర‌కెక్కిస్తున్న టైగ‌ర్ కేసీఆర్ చిత్రానికి సంబంధించి ఇటీవ‌ల టైటిల్ లోగో విడుద‌ల చేశారు. టైటిల్‌కి అగ్రెసివ్ గాంధీ అనే క్యాప్షన్ పెట్టాడు రామ్ గోపాల్ వర్మ. అంతేకాదు ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు అంటూ తెలుగులో ఉప శీర్షిక కూడా పెట్టాడు. ఇక ఉద‌యం 11గం.లకి చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించాడు. ఈ సినిమాలో కేసీఆర్, చంద్రబాబు, లోకేష్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్, కేటీఆర్, కవిత, ఉండవల్లి అరుణ్ కుమార్, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య లగడపాటి రాజగోపాల్ పాత్రలు ఉండబోతునట్లు ఆయన ప్రకటించారు మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన ఓ పాట ఆర్జీవీ స్వయంగా పాడి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories