వాళ్ళకి ఎంత పెద్ద శిక్ష వేసినా తక్కువే.... ప్రియాంకా హత్యపై వర్మ

వాళ్ళకి ఎంత పెద్ద శిక్ష వేసినా తక్కువే.... ప్రియాంకా హత్యపై వర్మ
x
రామ్ గోపాల్ వర్మ
Highlights

షాద్ నగర్ లో యువ వైద్యురాలు ప్రియాంకా రెడ్డి ఘటనపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా స్పందించారు.

షాద్ నగర్ లో యువ వైద్యురాలు ప్రియాంకా రెడ్డి ఘటనపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇంతటి ఘోరానికి పాల్పడిన వారిని పిచ్చి కుక్కలు అన్నాడు వర్మ.. వారిని చంపడం వృధా అని వాఖ్యానించారు. వారిని పిచ్చి కుక్కలు అని వదిలి పెట్టాలని కాదని రేపిస్ట్‌లను సమాజానికి చేసిన జబ్బులా భావించి ఆ రోగాన్ని ఎలా తగ్గించాలన్న విషయంలో శాస్త్రీయంగా పరిశోదన జరపాలని వర్మ పేర్కొన్నారు.

ఒక పామును ముక్కలుగా నరికితే మరో పాము మన దగ్గరికి రాకుండా ఉండదు. ఎందుకంటే వాటికి అంత ఆలోచనా శక్తి ఉండదు. ఒక ఓ పిచ్చి కుక్క గతంలో మరో పిచ్చి కుక్కపై జరిగిన దాడిని చూసి ఏం నేర్చుకుంటుంది అంటూ తనదైన స్టైల్‌లో స్పదించాడు వర్మ. వాళ్లను చంపేయాలి, తగలబెట్టాలి లాంటి డిమాండ్స్ కూడా వృధా అన్నాడు వర్మ.. దానికి బదులుగా మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేయాలని వర్మ పేర్కొన్నాడు.

సైకియాట్రిస్ట్‌లు, సోషల్‌ సైంటిస్ట్‌లు రేపిస్ట్‌లను ప్రశ్నించటం టీవీల్లో ప్రసారం చేయాలని కోరాలని అన్నారు వర్మ... దీనివలన వాళ్లలో అలాంటి రాక్షస నేర ప్రవృత్తి ఎలా వచ్చిందో తెలుసుకునే అవకాశం ఉంటుందని, భవిష్యత్తులో రేపిస్ట్‌లను ముందే పసిగట్టే అవకాశం కూడా ఉంటుందని పేర్కొన్నాడు వర్మ. ఇక శిక్ష పడుతుందన్న భయం ఎప్పుడూ నేరస్థుడిని, నేరాన్ని ఆపదు ఎందుకంటే ఒక నేరస్థుడు తనను ఎప్పటికీ పట్టుకోలేడని నమ్ముతాడు .. అతను చిక్కుకుపోతాడని కూడా అనుకుంటే అతను ఎప్పటికీ నేరం చేయడు అంటూ స్పందించాడు వర్మ..

వర్మతో పాటు చాలా మంది ప్రియాంకారెడ్డి ఘటనపై తమదైన శైలలో స్పందించారు. నిందితులకు ఉరి శిక్షపడాలని కోరుకుంటున్నారు. ఇక నిందితులను నిన్న షాద్ నగర్ జైలు నుండి భారీభద్రత నడుమ చర్లపల్లి జైలుకి తరలించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories