Top
logo

అకీరాను లాంచ్ చేయనున్న మెగా పవర్ స్టార్?

అకీరాను లాంచ్ చేయనున్న మెగా పవర్ స్టార్?
Highlights

ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి దాదాపుగా డజన్ మంది హీరోలు ఉన్నారు. చిరంజీవి నుంచి మొదలు రాబోతున్న వైష్ణవ్ తేజ్, పవన్ తేజ్ వరకు ఇండస్ట్రీలో ఇప్పటికే అడుగుపెట్టారు.

ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి దాదాపుగా డజన్ మంది హీరోలు ఉన్నారు. చిరంజీవి నుంచి మొదలు రాబోతున్న వైష్ణవ్ తేజ్, పవన్ తేజ్ వరకు ఇండస్ట్రీలో ఇప్పటికే అడుగుపెట్టారు. ఇక పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ ఒక్కడే లేట్.. అకీరా నందన్ సినిమాల్లోకి వస్తున్నాడని ఎప్పటినుంచో ప్రచారం అయితే సాగుతుంది. పలుమార్లు ఇదే అంశంపై అకీరా తల్లి రేణుదేశాయ్ కూడా స్పందించారు. అకీరా ఇప్పుడు చదువుకుంటున్నాడని, ఇప్పట్లో సినిమాలు అంటే కష్టమేనని చెప్పుకొచ్చింది.

అయితే మళ్ళీ ఇప్పుడు ఇదే వార్త తెరపైకి వచ్చింది. అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్దమవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కొడుకును హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంచ్ చేస్తాడని టాక్ నడుస్తోంది. తన సొంత నిర్మాణ సంస్థ అయిన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నుంచి అకీరాను సినిమాలోకి లాంచ్ చేయాలని అనుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు.

అకిరా తల్లి రేణుదేశాయ్ తెరకెక్కించిన 'ఇష్క్ వాలా లవ్' సినిమాలో అకీరా చిన్న పాత్రలో నటించి నటుడుగా ప్రూవ్ చేసుకున్నాడు. ఇక దీనితో అకిరాను తొందరగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్న డిమాండ్ ఫ్యాన్స్ నుంచి కూడా పెరుగుతుంది. ఈ నేపధ్యంలో అకిరాను రామ్ చరణ్ లాంచ్ చేయనున్నాడని వార్త తెరపైకి రావడంతో పవన్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. చూడాలి మరి అకిరా టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో అన్నది చూడాలి మరి ..

ఇక రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ లో హీరోగా నటిస్తున్నాడు. అంతేకాకుండా తన తండ్రి చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకి ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

Web TitleRam Charan to launch Pawan kalyan son Akira
Next Story


లైవ్ టీవి