మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ .. త్వరలోనే అబ్బాయితో, బాబాయ్ సినిమా ?

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ .. త్వరలోనే అబ్బాయితో, బాబాయ్ సినిమా ?
x
Highlights

రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ సినిమాలపైన కూడా ఫోకస్ పెట్టారు పవన్ కళ్యాణ్..ఎప్పుడు లేనంతగా వరుసపెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నారు.

రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ సినిమాలపైన కూడా ఫోకస్ పెట్టారు పవన్ కళ్యాణ్..ఎప్పుడు లేనంతగా వరుసపెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే పింక్ రీమేక్ షూటింగ్ కూడా మొదలై శేరావేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా కోసం పవన్ కేవలం 20 రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చారని, దాదాపుగా పవన్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిందని సమాచారం.. ఇక ఈ సినిమా తర్వాత పవన్ క్రిష్, హరీష్ శంకర్ లతో సినిమాలు చేసేందుకు సిద్దం అయ్యారు. ఇందులో క్రిష్ మూవీ ఇప్పటికే స్టార్ట్ అయింది కూడా ...

అయితే పవన్ సినిమాల్లో నటించడం కన్నా సినిమా నిర్మాణరంగం వైపే ఎక్కువగా ఇష్టం చూపిస్తున్నారు. గబ్బర్ సింగ్ సినిమాని తన నిర్మాణసంస్థలోనే తెరకెక్కించాలని పవన్ అనుకున్నారు కానీ ఆ సినిమాని బండ్ల గణేష్ కి ఇచ్చారు. ఇక తన అన్నయ్య కొడుకు రామ్ చరణ్ తో ఓ సినిమాని చేయాలనీ పవర్ స్టార్ ఎప్పటినుంచో అనుకుంటూ వస్తున్నారు. అంతేకాకుండా రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాని పవన్ అనౌన్స్ కూడా చేశాడు.. కానీ సరైనా కథ, దర్శకుడు దొరకకపోవడం, రాజకీయాల్లో పవన్ బిజీ అవుతూ ఉండడంతో ఈ ప్రాజెక్ట్ లేట్ అవుతూ వస్తోంది.

అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ త్వరలో పట్టాలేక్కనుందని తెలుస్తోంది. దీనికి దర్శకుడు బాబీ అన్నట్టుగా చర్చ నడుస్తోంది. రామ్ చ‌ర‌ణ్ ప్రస్తుతం రాజ‌మౌళి ద‌ర్శక‌త్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా తర్వాత పవన్ నిర్మాణంలో తెరకెక్కబోయే సినిమాలో చరణ్ సినిమా ఉంటుందని సమాచారం. మరికొన్ని రోజుల్లో ఈ సినిమాపైన పూర్తి వివరాలు రానున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories