కొరటాల సినిమా కోసం చరణ్ 40 రోజుల డేట్స్

కొరటాల సినిమా కోసం చరణ్  40 రోజుల డేట్స్
x
Highlights

సైరా లాంటి సందేశాత్మక చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి కొరటాల డైరెక్షన్ లో ఓ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.

సైరా లాంటి సందేశాత్మక చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి కొరటాల డైరెక్షన్ లో ఓ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా సినిమాకి సంబంధించిన రెగ్యలర్ షూటింగ్ కోకాపేట లోని చిరంజీవి స్థలంలో వేసిన సెట్ లో మొదలైంది. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇందులో చిరంజీవి దేవాదాయ శాఖలో పనిచేసే అధికారిగా కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకి గోవిందా ఆచార్య అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు వినికిడి.

ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయనున్నాడని మొదటినుంచి ప్రచారం నడుస్తుంది. అయితే ఇందులో ప్లాష్ బ్యాక్ లో వచ్చే సన్నివేశాలలో యంగ్ చిరంజీవిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించనున్నారని వార్తలు జోరుగా వచ్చాయి. కానీ దీనిపైన చిత్ర బృందం అయితే స్పందించింది లేదు. ఇప్పుడు దీనికి సంబంధించిన మరో వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది.

ఈ సినిమా కోసం రామ్ చరణ్ 40 రోజుల డేట్స్ కూడా అడ్జెస్ట్ చేసాడని తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్. ఆర్. ఆర్ మూవీ షూటింగ్ లో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత చరణ్ కొరటాల సినిమాకి షిఫ్ట్ కానున్నాడని తెలుస్తోంది. అయితే ఇందులో రామ్ చరణ్ ఎలా కనిపించనున్నాడని మెగా అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమాను కేవలం 99 రోజుల లోపే పూర్తి చేస్తానని సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్‌ వేదికగా మెగాస్టార్‌కు మాటిచ్చాడు దర్శకుడు కొరటాల శివ.. అంటే ఏప్రిల్ 10 లోపే ఈ సినిమా పూర్తి చేయాల్సి ఉంటుంది. మరి కొరటాల పూర్తి చేస్తాడా లేదా అన్నది చూడాలి. ఇక ఈ సినిమా తర్వాత కొరటాల రామ్ చరణ్ తో సినిమాని చేయనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే వీరి మధ్య సినిమా మొదలై ఆగిపోయిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories