సానియా మీర్జాతో రామ్ చరణ్ డ్యాన్స్.. వీడియో వైరల్

సానియా మీర్జాతో రామ్ చరణ్ డ్యాన్స్.. వీడియో వైరల్
x
Ram charan
Highlights

టెన్నిస్ క్రీడాకారణి సానియా మిర్జా సోదరి ఆనమ్ పెళ్లి రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే..

టెన్నిస్ క్రీడాకారణి సానియా మిర్జా సోదరి ఆనమ్ పెళ్లి రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.. ఈ రిసెప్షన్ కు సినీ పరిశ్రమకి చెందిన చాలా మంది హాజరయ్యారు. అందులో సానియా మీర్జాకు అత్యంత సన్నిహితుడు అయిన రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి హాజరయ్యారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే తాజాగా ఆ రిసెప్షన్ లో ఓ బాలీవుడ్ సాంగ్ కి స్టెప్స్ వేశాడు రామ్ చరణ్.. దీనికి సంబందించిన వీడియోను ఉపాసన తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రాకింగ్ ద డ్యాన్స్ ఫ్లోర్ అంటూ పోస్ట్ చేసింది. సానియా మీర్జా, బాలీవుడ్ సెలబ్రిటీ ఫరాఖాన్ లతో కలిసి రామ్ చరణ్ ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న వీడియోని చూడొచ్చు.

ఇక రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ అనే సినిమాని చేస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాని వచ్చే ఏడాది జులై 30న విడుదల చేయనున్నారు. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories