మహేష్ మేనల్లుడు కోసం రామ్ చరణ్..

ram charan, Galla ashok
x
ram charan, Galla ashok
Highlights

గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్ తెలుగు వెండితెరకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు....

గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్ తెలుగు వెండితెరకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 10(ఆదివారం ) రోజున రామానాయుడు స్టూడియోలో సినిమాని గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చాలా మంది టాలీవుడ్ ప్రముఖులు రానున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రానున్నట్లుగా తెలుస్తుంది. తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న గల్లా అశోక్ ని బ్లెస్ చేసేందుకు రామ్ చరణ్ వస్తున్నారని సమాచారం దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ సినిమాని గల్లా పద్మావతి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అశోక్ కి జోడిగా ఇస్మార్ట్ శంకర్ బ్యూటి నిధి అగర్వాల్ నటించనుంది. జీబ్రాన్ సంగీతం అందించనున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories