"నిన్నే పెళ్ళాడతా"లో రకుల్ ప్రీత్ సోదరుడు

నిన్నే పెళ్ళాడతాలో  రకుల్ ప్రీత్ సోదరుడు
x
Highlights

టాలివుడ్, కోలివుడ్ లో వరుస విజయాలను అందుకుంటున్న స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు తన సోదరున్ని తెలుగు చిత్ర సీమకు పరిచయం చేస్తుంది.

టాలివుడ్, కోలివుడ్ లో వరుస విజయాలను అందుకుంటున్న స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు తన సోదరున్ని తెలుగు చిత్ర సీమకు పరిచయం చేస్తుంది. రకుల్ సోదరుడు 'అమన్' హీరోగా, తొలి పరిచయం 'సిద్ధిక' కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా దాదాపుగా పూర్తి కావొచ్చింది.

ఈ సినిమాకి 'నిన్నే పెళ్లాడతా' అనే టైటిల్ ను ఖరారు చేశారు. వైకుంఠ బోను దర్శకత్వంలో రమ్య - శ్రీధర్ బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో కేవలం రెండు యాక్షన్ సీన్లు, రెండు పాటల మాత్రమే పూర్తి కావాల్సి వుంది. ఇతర ముఖ్య పాత్రలలో సాయికుమార్, సీత, ఇంద్రజ, కనిపించనున్నారు. 2019 డిసెంబర్ చివరి వారంలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ వుంది. రకుల్ అందుకున్నట్టుగానే అమన్ కూడా తన తొలి సినిమాతో హిట్ కొట్టాలని సినీవర్గాలు ఆశిస్తున్నాయి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories