logo

ఆ హీరోలతో ఓ సినిమా చేయాలనీ ఉంది : రకుల్

ఆ హీరోలతో ఓ సినిమా చేయాలనీ ఉంది : రకుల్
Highlights

పాపం గత కొద్దికాలంగా హిట్టు అంటే ఏంటి అన్న స్థాయికి వెళ్ళిపోయింది రకుల్... అందాల ఆరబోతకు ఈ అమ్ముడు సిద్దంగా...

పాపం గత కొద్దికాలంగా హిట్టు అంటే ఏంటి అన్న స్థాయికి వెళ్ళిపోయింది రకుల్... అందాల ఆరబోతకు ఈ అమ్ముడు సిద్దంగా ఉన్నప్పటికీ దర్శకనిర్మాతలు ఆమెను పట్టించుకోవడం లేదు. అప్పుడెపుడో వచ్చిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా రకుల్ కి మంచి హిట్టును ఇచ్చింది. ఇక నాగార్జునతో చేసిన మన్మధుడు2 సినిమా ఆమెకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. తాజాగా సూర్యకు జంటగా నటించిన ఎన్‌జీకే చిత్రం కూడా నిరాశపరిచింది. ప్రస్తుతం తమిళ్ , హిందీ భాషలలో సినిమాలు చేసుకుంటుంది రకుల్.. ఇందులో కమల్ హసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారతీయుడు 2 సినిమా చెప్పుకునే సినిమాగా ఉంది, అయితే తాజగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ నాకు తెలుగులో విజయ్ దేవరకొండతో, హిందీలో రన్వీర్ సింగ్ లతో ఓ సినిమా చేయాలనీ ఉందని పేర్కొంది. వారితో నటించేందుకు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది రకుల్...


లైవ్ టీవి


Share it
Top