సస్పెన్స్ థ్రిల్లర్ లో రకుల్

Rakul Preet Singh
x
Rakul Preet Singh
Highlights

2016 లో వరుస హిట్లతో స్టార్ హీరోయిన్ల రేంజ్ కి ఎదిగిన రకుల్ ప్రీత్ 2017 లో నాలుగు సినిమాలు చేస్తే అందులో కేవలం ఒకటి మాత్రమే హిట్ అయింది.

2016 లో వరుస హిట్లతో స్టార్ హీరోయిన్ల రేంజ్ కి ఎదిగిన రకుల్ ప్రీత్ 2017 లో నాలుగు సినిమాలు చేస్తే అందులో కేవలం ఒకటి మాత్రమే హిట్ అయింది. ఇక 'స్పైడర్' సినిమా డిజాస్టర్ అవ్వడంతో, 2018లో నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ఇక రకుల్ తెలుగు తెరపై మళ్లీ ఎప్పుడు మెరుస్తుంది అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు ఒక శుభవార్త. అటు హిందీ మరియు ఇటు తమిళ సినిమాలతో బిజీగా ఉన్న రకుల్ ఎట్టకేలకు ఒక తెలుగు సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చంద్రశేఖర్ ఏలేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం రకుల్ ప్రీత్ ను అడిగారట. కథ మరియు తన పాత్ర కూడా తనకు బాగా నచ్చడంతో రకుల్ కూడా ఈ సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరో ఎవరో ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ చేతిలో రెండు తమిళ సినిమాలు అలాగే రెండు హిందీ సినిమాలు ఉన్నాయి. ఈమె కార్తీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న 'దేవ్' సినిమా తెలుగులో కూడా విడుదల అవ్వనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories