రజినీ దర్బార్ కోసం ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు

రజినీ దర్బార్ కోసం ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు
x
Rajinikanth
Highlights

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ నటించిన తాజా చిత్రం దర్బార్.. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రేపు (జనవరి 9) న విడుదల కానుంది.

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ నటించిన తాజా చిత్రం దర్బార్.. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రేపు (జనవరి 9) న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్, ట్రైలర్, సాంగ్స్ కి ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. ఎఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రజినీ సరసన నయనతార, నివేతా థామస్ హీరోయిన్స్ గా నటించారు. అనిరుద్ సంగీతం అందించగా, లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఈ సినిమాలో రజినీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.

రేపు విదుదలవుతున్న ఈ సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ధియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. ధియేటర్ల వద్ద అభిమానులు రజినీకాంత్ భారీ కటౌట్లను ఏర్పాటు చేసి పాలాభిషేకాలు చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమాపైన తక్కువ అంచనాలే ఉన్నప్పటికీ తమిళనాట మాత్రం భారీ అంచనాలే ఉన్నాయి.. అయితే ఈ సినిమా భారీ హిట్టు కావాలని కావాలని మధురైలోని రజనీ అభిమానులు కొందరు బుధవారం దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అందులో భాగంగా కొందరు అభిమానులు శూలాలతో శరీరంపై గుచ్చుకొని రజనీపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. 15 రోజులపాటు ఉపవాసముండి విడుదలకు ముందు రోజైన బుధవారం నాడు 'మాన్ సోరు'(నేలపైనే భోజనం) నిర్వహించారు. ఇలా ఉపవాస దీక్ష చేసి ఆఖరి రోజున నేలపైనే భోజనం చేయడం వల్ల సినిమా కచ్చితంగా హిట్టు అవుతుందని అభిమానులు నమ్ముతున్నారు.

రజినీ సినిమాకి గాను ఉద్యోగులకి సెలవు ...

రేపు రజినీ సినిమా విడుదల అవుతుండడంతో చెన్నై లోని 'మై మనీ మంత్ర' అనే ఓ కంపెనీ తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు సినిమా టికెట్లు కొని ఇవ్వడంతో పాటు హాలీడే కూడా అనౌన్స్ చేసింది. ఆఫీసులకు రాకపోయినా పర్లేదు మేం పే చేస్తామంటూ ప్రకటిస్తూ ఈ ఆఫర్ ఇచ్చింది. అంతేకాకుండా జనవరి 9న దర్బార్ రిలీజ్ డేను సెలవుగా ప్రకటిస్తున్నామని డైరెక్టర్‌ సర్కులర్‌ విడుదల చేసాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇది కొత్త విశేషం అయితే కాదు. గతంలో కూడా రజినీ సినిమాలు అయిన కబాలి, 2.0 సినిమాలు విడుదలైనపుడు కూడా ఇలాగే కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు హాలీడే ప్రకటించాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories