రజీని దర్బార్ కోసం ఉద్యోగులకి సెలవు... టికెట్లు కూడా ఇస్తున్న కంపెనీ!

రజీని దర్బార్ కోసం ఉద్యోగులకి సెలవు... టికెట్లు కూడా ఇస్తున్న కంపెనీ!
x
Rajinikanth Darbar
Highlights

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా విడుదలవుతుంది అంటే తమిళనాట అదో పెద్ద పండగేనని చెప్పాలి. తాజాగా అయన నటించిన దర్బార్ చిత్రం సంక్రాంతి కానుకగా రేపు (జనవరి 9) న విడుదల కానుంది.

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా విడుదలవుతుంది అంటే తమిళనాట అదో పెద్ద పండగేనని చెప్పాలి. తాజాగా అయన నటించిన దర్బార్ చిత్రం సంక్రాంతి కానుకగా రేపు (జనవరి 9) న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్, ట్రైలర్, సాంగ్స్ కి ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. ఎఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రజినీ సరసన నయనతార, నివేతా థామస్ హీరోయిన్స్ గా నటించారు. అనిరుద్ సంగీతం అందించగా, లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించింది.

రేపు విదుదలవుతున్న ఈ సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ధియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. ధియేటర్ల వద్ద అభిమానులు రజినీకాంత్ భారీ కటౌట్లను ఏర్పాటు చేసి పాలాభిషేకాలు చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమాపైన తక్కువ అంచనాలే ఉన్నప్పటికీ తమిళనాట మాత్రం భారీగానే ఉన్నాయి.. అయితే రజినీ సినిమా విడుదల సందర్భంగా చెన్నై లోని 'మై మనీ మంత్ర' అనే ఓ కంపెనీ తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్ ఇచ్చింది. సినిమా టికెట్లు కొని ఇవ్వడంతో పాటు హాలీడే కూడా అనౌన్స్ చేసింది. ఆఫీసులకు రాకపోయినా పర్లేదు మేం పే చేస్తామంటూ ప్రకటిస్తూ ఈ ఆఫర్ ఇచ్చింది.

అంతేకాకుండా జనవరి 9న దర్బార్ రిలీజ్ డేను సెలవుగా ప్రకటిస్తున్నామని డైరెక్టర్‌ సర్కులర్‌ విడుదల చేసాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇది కొత్త విశేషం అయితే కాదు. గతంలో కూడా రజినీ సినిమాలు అయిన కబాలి, 2.0 సినిమాలు విడుదలైనపుడు కూడా ఇలాగే కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు హాలీడే ప్రకటించాయి.

ఇక తెలుగులో ఈ సినిమాతో పాటు సంక్రాంతి బరిలో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో , కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా సినిమాలు విడుదలవుతున్నాయి. మరి ఇందులో ఏది సంక్రాంతి సినిమా అనిపించుకుంటుందో చూడాలి మరి.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories