logo
సినిమా

కొత్త సంవత్సరం కానుక ఇవ్వనున్న రాజశేఖర్

కొత్త సంవత్సరం కానుక ఇవ్వనున్న రాజశేఖర్
X
Highlights

కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న సీనియర్ హీరో రాజశేఖర్ ఈ మధ్యనే 'గరుడవేగ' అనే సినిమాతో మన ముందుకు వచ్చారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఒక మంచి కథతో రాజశేఖర్ 'కల్కి' అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. 'ఆ!' ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.

కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న సీనియర్ హీరో రాజశేఖర్ ఈ మధ్యనే 'గరుడవేగ' అనే సినిమాతో మన ముందుకు వచ్చారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఒక మంచి కథతో రాజశేఖర్ 'కల్కి' అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. 'ఆ!' ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. 'గరుడవేగ' కంటే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని రాజశేఖర్ పూర్తి నమ్మకంతో ఉన్నారు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ ను కొత్త సంవత్సరం కానుకగా రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారని, 'కల్కి ఫస్ట్ అవతార్' అనే పేరుతో ఒక టీజర్ ను విడుదల చేస్తూ తెలియజేసింది చిత్ర బృందం. ఈ సినిమా కథ కూడా వైవిధ్యంగా ఉంటుందని, రాజశేఖర్ మార్క్ యాక్షన్ కూడా ఈ సినిమాలో కనిపిస్తుందని తెలుస్తుంది. సి.కళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టైటిల్ లాగానే రాజశేఖర్ పాత్ర కూడా ఈ సినిమాలో పవర్ఫుల్ గా ఉంటుందని సమాచారం.

Next Story