త్రివిక్రమ్ ని టెంక్షన్ పెడుతున్న రాజమౌళి!

త్రివిక్రమ్ ని టెంక్షన్ పెడుతున్న రాజమౌళి!
x
Highlights

తెలుగు సినిమాల్లో సెంటిమెంట్స్ ఎక్కువ ..అది హీరో, హీరోయిన్స్ ల నుండి దర్శకనిర్మాతల వరకు ఎవరికైనా కావచ్చు.

తెలుగు సినిమాల్లో సెంటిమెంట్స్ ఎక్కువ ..అది హీరో, హీరోయిన్స్ ల నుండి దర్శకనిర్మాతల వరకు ఎవరికైనా కావచ్చు. ఒక్కసారి సెంటిమెంట్ వర్కౌట్ అయితే ఇక అన్ని సినిమాలకు అదే సెంటిమెంట్స్ ని రీపీట్ చేసుకుంటూ వెళ్తారు... ఉదాహరణకి సినిమా స్క్రిప్ట్ ని ముందుగా తిరుమల శ్రీవారి దగ్గరికి వెళ్లి పూజలు చేయడం నిర్మాత దిల్ రాజుకి ఓ సెంటిమెంట్ .. ఇక సినిమా ప్రారంబోత్సవానికి రాకపోవడం హీరో మహేష్ బాబుకి ఓ సెంటిమెంట్ .. ఇక సినిమా పేరులో చివర సున్నా ఉండేలా చూసుకోవడం హీరో గోపీచంద్ సెంటిమెంట్ .. ఇలా ఒక్కొక్కరు ఒక్కో సెంటిమెంట్ తో ముందుకు వెళ్తుంటారు ...

ఇక టాలీవుడ్ లో ఇవే కాకుండా మరో సెంటిమెంట్ ఉంది . అదేంటంటే దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేసాక అ హీరో నెక్స్ట్ ఏ సినిమా చేసిన సరే అ సినిమా అనుకున్న స్థాయిలో నిలబడలేదు. ఎన్టీఆర్ తో ముందుగా రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ అనే సినిమా చేసాడు. అ సినిమా మంచి విజయాన్ని అందుకుంది . అ తర్వాత ఎన్టీఆర్ రుద్రరాజు సురేష్ వర్మ దర్శకత్వంలో సుబ్బు అనే సినిమాని తీసాడు. అ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. అదే పరిస్థితి ఇప్పటివరకూ కొనసాగుతూ వచ్చింది.

రాజమౌళి దర్శకత్వంలో హీరోయిజం పీక్స్ లో వెళ్ళిపోతుంది. ఆ హీరో పై ఆ హీరోలసినిమాలపై విపరీతమైన అంచనాలు వచ్చేస్తాయి. దీంతో తరువాత వచ్చిన సినిమా వాటిని అందుకోవడంలో విఫలం అవడం సహజంగా జరిగిపోతుంది. ఇది దాదాపుగా రాజమౌళి సినిమాలు అన్నిటికీ జరిగింది. ఇక రాజమౌళి దర్శకత్వంలో నటించిన హీరోతో సినిమా చేసిన దర్శకుడికీ తిప్పలు తప్పవు. అయితే ఇప్పుడు ఇదే దర్శకుడు త్రివిక్రమ్ కి ఎదురు కాబోతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత ఏడాది ప్రభాస్ సాహో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్లాప్ ని మూటగట్టుకుంది. దీనికి ముందు ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో సాహో అనే సినిమాని చేశాడు. దీనితో ఈ సెంటిమెంట్ కి మరింత బలం చేకురినట్టు అయింది.

ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్. ఆర్. ఆర్ అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో సినిమాని చేయనున్నాడు ఎన్టీఆర్.. గతంలో వీరి కాంబినేషన్ లో అరవింద సమేత వీర రాఘవ అనే సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాకి రాజమౌళి సెంటిమెంట్ టెంక్షన్ పెడుతున్నప్పటికీ మరి ఆ సెంటిమెంట్ ని క్రాస్ చేసే సత్తా ఉన్న కాంబినేషన్ అని కూడా అనిపిస్తోంది. చూడాలి మరి ఎం జరుగుతుందో.. ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ కి ఇది 30 వ చిత్రం.. 2021 సమ్మర్ కి సినిమాని రిలీజ్ చేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories