RRR రికార్డుల జోరు మొదలైంది... ఒక్క వీడియోతో అన్ని మాటాష్

RRR రికార్డుల జోరు మొదలైంది... ఒక్క వీడియోతో అన్ని మాటాష్
x
RRR
Highlights

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్.. (రౌద్రం, రణం, రుధిరం).. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే..

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్.. (రౌద్రం, రణం, రుధిరం).. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే..సినిమా షూటింగ్ జరుగుతున్నప్పటికీ సినిమా నుంచి ఒక్క అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతూ వచ్చారు. ఇక తాజాగా ఉగాది సందర్భంగా సినిమాకి సంబంధించిన లోగోను మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం.

అంతేకాకుండా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ' భీమ్ ఫర్ రామరాజు ' పేరిట అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్ ని విడుదల చేసింది చిత్రబృందం. ఈ ఫ‌స్ట్ లుక్ వీడియో ప‌లు భాష‌ల‌లో విడుద‌లై ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. అంతేకాకుండా పలు రికార్డులను సైతం బద్దలు కొట్టింది.మరీ ముఖ్యంగా వేగంగా (28 గంటలు) ఐదు లక్షల లైకులు సాధించిన తొలి తెలుగు సినిమాగా నిలిచింది. ఈ క్రమంలోనే సాహో (35 గంటలు), అల.. వైకుంఠపురములో (4 రోజులు), సరిలేరు (6 రోజులు) రికార్డులు బద్దలైపోయాయి.

రామ్ చరణ్ ఫస్ట్ లుక్ వీడియోకు తెలుగుతో పాటు అన్ని భాషల్లో మంచి స్పందన వస్తోంది. తొలి 24 గంటల్లో తెలుగులో 7.09 మిలియన్, హిందీలో 5.10 మిలియన్, కన్నడలో 1.40 మిలియన్, తమిళంలో 1.32 మిలియన్, మలయాళంలో 0.56 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అలాగే, 17 నిమిషాల్లోనే లక్ష లైకులు సాధించిన తొలి తెలుగు సినిమా టీజర్‌గా ఇది రికార్డులకెక్కింది. ఒక్క టీజర్ వీడియోకి ఇలాంటి రెస్పాన్స్ వస్తే సినిమా రిలీజ్ అయ్యాక ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుంది అన్నది చూడాలి మరి..

ఇక పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని ఈ ఏడాది జూలై 30న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటిచింది.

కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల వలన సినిమాని వచ్చే ఏడాది 2021 జనవరి 8 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌ లతో పాటు హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్,సముద్రఖని,శ్రియ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇక బాహుబలి లాంటి సినిమా తర్వాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడం, ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథని అందించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories