మీ గొడవలోకి నన్ను లాగొద్దు : రాజమౌళి

మీ గొడవలోకి నన్ను లాగొద్దు : రాజమౌళి
x
Highlights

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు.. ఇప్పటికే సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేసి...

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు.. ఇప్పటికే సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేసి సినిమాకి ఎక్కడలేని పబ్లిసిటీ తెచ్చుకున్నాడు వర్మ.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అనంతరం జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందని ట్రైలర్ చూస్తుంటే అర్ధం అవుతుంది.

ఇక ఈ రోజు సినిమాకి సంబంధించి కేఎ పాల్ పాటని రిలీజ్ చేసాడు వర్మ.. ఈ పాటను విడుదల చేస్తూ వర్మ " ఇండియాలో జోకర్ మూవీ అంత పెద్ద విజయం సాధించిగా లేంది.., కేఏ పాల్‌పై వచ్చే బయోపిక్.. బహుబలి 3 కంటే పెద్ద హిట్ అవుతుందన్నారు. దీని కోసం రాజమౌళి వాషింగ్టన్‌లో పాల్‌తో చర్చించారని, ఇదే విషయం తనకు పాల్ ప్రత్యేకంగా నాకు ఫోన్ చేసి చెప్పారన్నారు. ఈ ట్వీట్‌లో రాజమౌళిని ట్యాగ్ చేశారు" అయితే దీనిపైన రాజమౌళి స్పందిస్తూ నన్ను ఇందులోకి లాగొద్దు రాజు గారు అంటూ ట్వీట్ చేసాడు రాజమౌళి. అయితే రాజమౌళి ట్వీట్ పై వర్మ తిరిగి స్పందిస్తూ " నేను ఇన్వాల్వ్ చేయడం కాదు సర్. ట్రంప్ టవర్‌లో మీరు, కేఏ పాల్ కలిసి లంచ్ చేశారని, `బాహుబలి-3` కోసం అతనితో సంతకం పెట్టించుకున్నారని కేఏ పాల్ నాకు చెప్పాడు. కావాలంటే కేఏ పాల్ మీద ఒట్టు " అని వర్మ రీట్వీట్ చేసాడు వర్మ


Show Full Article
Print Article
More On
Next Story
More Stories